గ్యాంగ్ లీడర్ కే ఎసరు పెట్టారుగా ?

Update: 2019-07-17 04:54 GMT
భారీ సినిమాలతో వచ్చిన చిక్కే ఇది. ఒక విడుదల తేదీని ప్రకటించి దానికే కట్టుబడి ఉండటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. నిన్న సాయంత్రం హటాత్తుగా సాహో విడుదల వాయిదా పడినట్టుగా వచ్చిన వార్త సినిమా లోకాన్ని ఊపేసింది. ఆగస్ట్ 15 ఖచ్చితంగా వస్తుందని బోలెడు ఆశలతో ఎదురు చూసిన అభిమానులకు ఇది శరాఘాతమే. కొత్త డేట్ అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఆగస్ట్ 30 ఫిక్స్ అయినట్టు గట్టిగా వినిపిస్తోంది.

ఇప్పుడు కూడా తొందపడకుండా అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని ఆ టైంకైనా సాధ్యమవుతుందా లేదా అని ఒకటికి రెండు సార్లు చర్చించుకుని ఆ తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏదైనా 30 తేది బలంగా ప్రచారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు నాని గ్యాంగ్ లీడర్ కు చిక్కొచ్చి పడింది

కేవలం మూడు రోజుల క్రితమే గ్యాంగ్ లీడర్ విడుదలను ఆగస్ట్ 30కి లాక్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా వదిలారు. ఇప్పుడు సాహో కూడా అదే డేట్ కావాలని పట్టుబడితే నాని వెనక్కు లేదా ముందుకు జరగక తప్పదు. సాహో లాంటి భారీ బడ్జెట్ మూవీస్ కి సైడ్ ఇవ్వడం తప్ప ఏ హీరో అయినా చేయగలిగింది ఏమి లేదు.కాని యువి సంస్థ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చాకే దీనికి సంబంధించిన మార్పు గురించి తెలుస్తుంది. అప్పటి దాకా వెయిట్ చేయాల్సిందే.

ఒకవేళ సెప్టెంబర్ కు గ్యాంగ్ లీడర్ వెళ్తే వెంకీ మామ లేని డేట్ ను చూసుకుని ప్లాన్ చేసుకోవాలి. కాస్త అడ్వాన్స్ గా షూటింగ్ అయ్యుంటే సాహో వదిలేసిన ఆగస్ట్ 15 గ్యాంగ్ లీడర్ కి సూపర్ గా వర్క్ అవుట్ అయ్యేది. ఇప్పుడు శర్వానంద్ అడవి శేష్ లు దాన్ని లాక్ చేశారు. చూడాలి గ్యాంగ్ లీడర్ ఏం చేస్తాడో

    

Tags:    

Similar News