• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RRR తో ఆ లిస్టులో తారక్...

RRR తో ఆ లిస్టులో తారక్ కూడా చేరతాడా?

By - Tupaki Desk
Update: 2019-11-05 07:17 GMT
టాలీవుడ్ లో నటవారసుల జోరు ఎక్కువే.  మెజారిటీ స్టార్లు ఏదో ఒక ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చినవారే.  తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో సహృదయం ఉన్నవారు.. నెపోటిజం అంటూ ఎంతమంది హంగామా చేసినా వారిని ఇసుమంత కూడా పట్టించుకోకుండా ఏరికోరి వారసులను ఎంపిక చేసుకుని వారిని అభిమానిస్తూ తరిస్తూ ఉంటారు.  అందుకే  టాలీవుడ్ లో దాదాపుగా బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ నటవారసుల పేరిటే ఉన్నాయి.

ఇండస్ట్రీలో ఇప్పుడు అన్నీ రికార్డ్స్ 'బాహుబలి-2' పేరిట ఉన్నాయి.  ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవన్నీ ప్రభాస్ ఖాతాలోనే పడతాయి.  మహేష్ బాబు 'శ్రీమంతుడు' తో మహేష్ బాబు కూడా నాన్ బాహుబలి రికార్డులు సృష్టించాడు.  ఇక చరణ్ కూడా 'రంగస్థలం' తో తన సత్తాను చాటి నాన్ బాహుబలి రికార్డు సాధించాడు. నటవారసులు కాకుండా భారీ కలెక్షన్ల రికార్డులు మెగాస్టార్ చిరంజీవికి మాత్రం ఉన్నాయి.  ఈ జెనరేషన్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్.. అల్లు అర్జున్ మాత్రం ఇలాంటి రికార్డులకు దూరంగా ఉన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ ఆరంభంలో 'సింహాద్రి' లాంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు సాధించినప్పటికీ ఈమధ్య మాత్రం భారీ రికార్డులు సృష్టించే సినిమాలు ఆయనకు తగలలేదు. దీంతో ఇప్పుడు అందరి కళ్ళూ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' పైనే ఉన్నాయి.  ఈ సినిమాలో చరణ్ మరో హీరోగా నటిస్తున్నప్పటికీ రాజమౌళి - ఎన్టీఆర్ ఒక డెడ్లీ కాంబినేషన్.  ఈ సినిమాతో ఎన్టీఆర్ రికార్డుల దుమ్ముదులపడం ఖాయమని.. మరోసారి ఎన్టీఆర్ రికార్డుల లిస్టులో అగ్రభాగాన నిలవడం లాంఛనమేనని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.  అయితే ఈ సినిమాలో చరణ్ కూడా మరో హీరో కాబట్టి ఇద్దరూ కలిసి రికార్డుల క్రెడిట్ తీసుకోవాల్సి వస్తుంది.
Tags:    
  • Ntr 
  • jr Ntr 
  • Komaram Bheem 
  • Ntr Fans 
  • RRR 
  • Rajamouli 
  • Ramcharan 
  • Alluri Seetha Rama Raju 
  • Ntr Fans Enjoying Ntr New Look 

Similar News

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS