• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజ్ దూత్ కు బ్రేక్...

రాజ్ దూత్ కు బ్రేక్ పడిందే

By - Tupaki Desk
Update: 2019-07-03 10:31 GMT
రియల్ స్టార్ శ్రీహరి వారసుడిగా తెరకు పరిచయమవుతున్న మేఘంష్ మొదటి సినిమా రాజ్ దూత్ ఎల్లుండి విడుదల కావడం లేదట. ట్రైలర్ తో పాటు పోస్టర్స్ లో రిలీజ్ డేట్ జులై 5గా పేర్కొంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అదే చెప్పారు. అయితే ఇప్పుడది సాధ్యపడేలా లేదు. సెన్సార్ సకాలంలో పూర్తి కాకపోవడంతో పాటు తగినన్ని స్క్రీన్లు దొరికే చాన్సు లేకపోవడంతో మరోవారం వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇంకొద్ది గంటల్లో వెలువడవచ్చు.

ఇప్పటిదాకా ఆన్ లైన్ బుకింగ్ పెట్టకపోవడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ఒకవేళ నిజమే అయితే ఇది మంచి నిర్ణయమే అనుకోవాలి. జులై 5న బజ్ మొత్తం సమంతా ఓ బేబీ మీదే ఉంది. సురేష్ సంస్థ కాబట్టి గ్రాండ్ రిలీజ్ దక్కుతోంది. మరోవైపు బుర్రకథను సైతం బాగానే మార్కెట్ చేస్తున్నారు. అటు చూస్తే మల్టీ ప్లెక్సులలో స్పైడర్ మ్యాన్ హంగామా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్ దూత్ వాయిదా సరైనదే అని చెప్పాలి. మేఘంష్ మీద కానీ సినిమా గురించి కానీ ప్రేక్షకులకు ఇంకా అవగాహన రానే లేదు.

ప్రమోషన్ కాస్త ఉదృతంగా చేసి ఆపై వదిలితే ఓపెనింగ్స్ ని ఆశించే అవకాశం ఉంటుంది. కేవలం శ్రీహరి ఫ్యాన్స్ తో హాల్స్ నింపడం కష్టం. దానికి తోడు సెన్సార్ తతంగం కొంత ఆలస్యం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్ ఫోన్ చేసినట్టుగా చెబుతున్నారు. దీని మీద శ్రీహరి భార్య శాంతి చాలా ఆశలు పెట్టుకున్నారు. డెబ్యూ మూవీ కావడంతో ఇది హిట్ అయితే మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు.ఈ లెక్కన జులై 12కి షిఫ్ట్ అవ్వడం ఒకటే రాజ్ దూత్ ముందున్న ఛాయస్

    

Tags:    
  • Rajdoot Movie 
  • Meghamsh Srihari 
  • Latest News 
  • Telugu News 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS