బాలయ్య లేకుండానే BB3 షూటింగ్ చేయనున్నారా...?

Update: 2020-10-16 10:30 GMT
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చిత్రీకరణ దశలో ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవుతుండటంతో బిబి3 చిత్రీకరణ కూడా స్టార్ట్ చేయాలని బోయపాటి సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బోయపాటి షూటింగ్‌ ను తిరిగి ప్రారంభించాలని ఆలోచిస్తున్నప్పటికీ.. రోజురోజుకి కోవిడ్ -19 కేసులు భారీగా పెరుగుతుండటంతో బాలయ్య మాత్రం సెట్స్‌ లో అడుగుపెట్టడానికి ఆసక్తి చూపడం లేదట. కరోనా కేసులు తగ్గిన తర్వాతే బాలకృష్ణ షూటింగ్ లో జాయిన్ కావొచ్చు అంటున్నారు. కాకపోతే డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సమయాన్ని వేరే నటీనటులతో ఉండే సీన్స్ షూట్ చేయడానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. బిబి3 తదుపరి షెడ్యూల్‌ కు సంబంధించి త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
 
కాగా, బాలయ్య - బోయపాటిల కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వీరిద్దరూ చేసిన గత చిత్రాలు 'సింహ' 'లెజెండ్' భారీ విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న బోయపాటి - బాలయ్య ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. దీనికి తగ్గట్టే BB3 ఫస్ట్ లుక్‌ టీజర్ విశేషమైన స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బాలయ్య పక్కన కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన బోయపాటి.. మలయాళ బ్యూటీ ప్రగ్యా మార్టిన్ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Tags:    

Similar News