చరణ్ స్పెషల్ ఫోటోషూట్.. మామూలుగా లేదుగా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి గ్లోబల్ రేంజ్ లో తన స్టైలిష్ ప్రెజెన్స్‌ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.;

Update: 2026-04-13 13:17 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి గ్లోబల్ రేంజ్ లో తన స్టైలిష్ ప్రెజెన్స్‌ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియా ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజీపై మెరిసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆ ఫోటోషూట్‌ ను దుబాయ్‌ లో నిర్వహించగా, ప్రస్తుతం ఆ కవర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.



 


ఆర్ఆర్ఆర్ విజయంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చరణ్.. ఆ తర్వాత తన టాలెంట్ తో మరింత క్రేజ్ పెంచుకుంటున్నారు. తాజా ఫోటోషూట్‌ లో ఆయన లుక్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. నీటిలో తీసిన ఆక్వాటిక్ షాట్స్‌ లో చరణ్ రా అండ్ మాగ్నెటిక్ ఇంటెన్సిటీని చూపించగా, స్ట్రీట్ స్టైల్ లుక్‌ లో క్లాస్, స్వాగ్‌ తో మెప్పించారు.



 


విభిన్నమైన స్టైల్స్‌ ను ఈజీగా క్యారీ చేయగలగడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. అయితే ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజీపై మెరిసిన రెండో తెలుగు హీరోగా చరణ్ రికార్డు సృష్టించారు. అంతకుముందు ఆ గౌరవం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు దక్కింది. దీంతో టాలీవుడ్ నుంచి మరోసారి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కినట్లైంది. ఈ సందర్భంగా మ్యాగజైన్ సంస్థ చరణ్‌పై ప్రశంసలు కురిపించింది.

'డిసిప్లిన్, ఆత్మవిశ్వాసంతో ఈ స్థాయికి ఎదిగిన నటుడు. ప్రతి సినిమాతో తనను తాను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆర్భాటాల కంటే సరైన ఎంపికలకు ప్రాధాన్యం ఇస్తారు' అంటూ కొనియాడింది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తుండగా, సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.

నిర్మాతగా వెంకట సతీష్ కిలారు వ్యవహరిస్తుండగా.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఆ మూవీ నుంచి వచ్చిన పాటలు మంచి స్పందనను తెచ్చుకుని కోట్ల వ్యూస్ సాధించాయి. చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుండగా, తాజాగా నటుడు సాయి కుమార్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఓ పాట షూటింగ్ జరుగుతోందని, ఆ సాంగ్‌ లో చరణ్ ఎనర్జీ అద్భుతంగా ఉందని తెలిపారు.

అలాగే సినిమాలో తాను కూడా భాగమవుతున్నట్లు చెప్పడంతో పెద్దిపై ఆసక్తి మరింత పెరిగింది. ఆ సినిమా ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వచ్చిన గ్లింప్సెస్, పాటలు సినిమాపై భారీ హైప్‌ ను క్రియేట్ చేశాయి. మొత్తానికి, ఒకవైపు గ్లోబల్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసి కొత్త రికార్డు సృష్టించిన రామ్ చరణ్, మరోవైపు పెద్దితో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. స్టైల్, నటన, గ్లోబల్ ఇమేజ్ అన్నీ కలిపి ఆయన జర్నీ మరింత హైరేంజ్ కు తీసుకెళ్తున్నాయని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.

Tags:    

Similar News