అఖిల్ నెక్స్ట్ సినిమాకు కూడా రిస్క్ చేస్తాడా?

Update: 2019-08-03 01:30 GMT
విజయం కోసం ఎదురుచూస్తున్న స్టార్ కిడ్స్ లో అక్కినేని అఖిల్ ఒకరు.  టాలీవుడ్ లో అలా సక్సెస్ కోసం ఎదురు చూసే మిగతా స్టార్ కిడ్స్ ఎవ్వరూ లేరా అంటే... ఉన్నారు కానీ వారిలో ఎవ్వరిపైన అభిమానుల్లో అఖిల్ పై ఉన్నన్ని అంచనాలు లేవు.  అయితే వరసగా మూడు ఫ్లాపులతో అఖిల్ పైన అంచనాలు తగ్గిన మాట కూడా వాస్తవం.  ప్రస్తుతం  అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రీసెంట్ గా అఖిల్ ను కలిసి ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టొరీని వినిపించాడట.  ప్రశాంత్ చెప్పిన ప్రేమకథ అఖిల్ కు నచ్చడంతో ఈసినిమాను చేసేందుకు సానుకూలంగా ఉన్నాడని అంటున్నారు. ఒకవేళ అంతా సవ్యంగా జరిగి.. పట్టాలెక్కితే మాత్రం ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తారని టాక్.  నిరంజన్ రెడ్డి చిరంజీవి-కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొదటి సినిమా 'అ!' తో విజయం సాధించి అందరి దృష్టిని అకర్షించాడు.  అయితే రెండవ సినిమా 'కల్కి' మాత్రం ఫెయిల్యూర్ గా నిలిచింది.  మరి తన నెక్స్ట్ సినిమా అఖిల్ తోనే ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.  అఖిల్ ప్రస్తుతం పని చేస్తున్న డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఫెయిల్యూర్ లో ఉన్నాడు.  భాస్కర్ తో సినిమా అంటేనే చాలామంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఫ్లాప్ లో ఉన్న ప్రశాంత్ వర్మతో నిజంగానే అఖిల్ సినిమా చేస్తాడా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం.  అసలు ఈ ప్రాజెక్టుకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే అఖిల్ కూడా హిట్ కోసం చాలారోజులుగా ఎదురు చూస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో.

    
    
    

Tags:    

Similar News