తెలుగు హీరోలెవ్వరు సందీప్‌ ని నమ్మడం లేదా?

Update: 2020-09-14 09:10 GMT
టాలీవుడ్‌ లో 'అర్జున్‌' రెడ్డి సినిమాను తెరకెక్కించి ఆ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్‌ వంగ. ట్రెండ్‌ సెట్టర్‌ మూవీ అంటూ అర్జున్‌ రెడ్డికి పేరు వచ్చింది. విజయ్‌ దేవరకొండతో పాటు సందీప్‌ కూడా టాలీవుడ్‌ లో స్టార్స్‌ గా మారిపోయారు. అర్జున్‌ రెడ్డి తర్వాత తెలుగులో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కూడా బాలీవుడ్‌ లో తన సినిమాను రీమేక్‌ చేసే అవకాశం రావడంతో అటు వెళ్లాడు. అర్జున్‌ రెడ్డిని కబీర్‌ సింగ్‌ గా రీమేక్‌ చేసి అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

తెలుగులో ఈయన సినిమాలు చేయాలని గత కొన్నాళ్లుగా హీరోలకు స్ర్కిప్ట్‌ వినిపించారు. మహేష్‌ బాబు నుండి మొదలుకుని చరణ్‌ వరకు చాల మంది పెద్ద హీరోలకు సందీప్‌ కథలు వినిపించాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు టాలీవుడ్‌ హీరోలు ఎవరు ఈయనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. దాంతో మళ్లీ హిందీలోనే సినిమాను చేయాలనే నిర్ణయానికి సందీప్‌ వచ్చాడు. రణబీర్‌ కపూర్‌ తో తన తదుపరి సినిమాను చేసేందుకు దర్శకుడు సందీప్‌ వంగ స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం అతడు చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత సందీప్‌ కు డేట్లు కేటాయించే అవకాశం ఉంది అంటున్నారు.

సందీప్‌ మూవీని పాన్‌ ఇండియా రేంజ్‌ లో తీయాలని భావిస్తున్నాడు. అంటే సౌత్‌ లో అన్ని భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడు. టాలీవుడ్‌ స్టార్‌ హీరో తో సినిమాలు చేసి హిందీతో పాటు ఇతర భాషల్లో సినిమాను విడుదల చేయాలని భావించారు. కాని టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎవరు కూడా ఇంకా సందీప్‌ ను బలంగా నమ్మలేక పోతున్నారు. దాంతో చేసేది లేక హిందీలోనే మరో సినిమాను చేయాలని దాన్ని తెలుగుతో పాటు ఇతర సౌత్‌ భాషల్లో విడుదల చేయడం వల్ల ఖచ్చితంగా ఆ తర్వాత అయిన టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఆయనకు పిలిచి మాట ఇస్తాడేమో అంటున్నారు.
Tags:    

Similar News