ఈ సినిమా పై ఇంత నెగెటివిటీ ఎందుకు?

Update: 2020-02-05 15:30 GMT
ఒక్కో సినిమాకు రిలీజ్ కు ముందు మంచి బజ్ ఉంటుంది. వాతావరణం పాజిటివ్ గా కనిపిస్తుంది. ప్రమోషన్స్ విషయమే కాదు.. మీడియాలో కూడా అంతా సానుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని సినిమాలకు మాత్రం రిలీజుకు ముందే నెగెటివిటి ఏర్పడుతుంది. అసలు బజ్ఉండదు. ప్రోమోస్ కూడా నీరసంగా ఉంటాయి. ఫిలిం మేకర్లు కూడా ప్రమోషన్స్ చెయ్యకుండా చేతులెత్తేసిన విషయం అందరికీ అర్థం అవుతుంది. త్వరలో విడుదల కానున్న ఒక సినిమాకు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

ఈ సినిమా వెనక ఉండేది ఒక బడా నిర్మాత. అయితే ఆయనపై ట్రేడ్ వర్గాలలో అసలు మంచి అభిప్రాయమే లేదని టాక్ ఉంది. సినిమాలకు సరిగా ప్రమోషన్లు చెయ్యకుండా వాటి పరాజయానికి కారణం అవుతున్నాడని చాలారోజుల నుంచి ఒక బ్యాడ్ టాక్ ఉంది. ఈ సంగతి ఆయనకు కూడా తెలిసిందే కానీ తూతూమంత్రం ప్రమోషన్ల తో కాలక్షేపం చేస్తూ 'ప్రచారం చేశాను అంటే చేశా.. ఇక మీ చావు మీరు చావండి' అన్నట్టు గా వదిలేస్తున్నాడట. దీంతో ఈయన బ్యానర్ లో నటించిన హీరో హీరోయిన్లు యాంకర్ సుమ అవాక్కయ్యారా అని అడగక మునుపే అవాక్కవుతూ ఉన్నారట.

ఈ నిర్మాత బ్యానర్ లో తెరకెక్కిన సినిమా పై ఉన్న నెగెటివిటి ఈమధ్య కాలంలో మరే సినిమాకు లేదని ఇండస్ట్రీ వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లకు ఆయన ఎంచుకున్న మార్గం.. హీరో హీరోయిన్లను ఎక్కడో చిన్న కాలేజిలకు తిప్పడం. మరి దీంతో ఈ సినిమాకు ఎంత ప్రచారం లభిస్తుందో వేచి చూడాలి. ఈయన పాత చింతకాయ పచ్చడి ప్రచారానికి ఇండస్ట్రీలో చాలామంది పడిపడి నవ్వుతున్నారట. మరి ఇప్పటికైనా ఆయన విషయం గ్రహిస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News