మోస్ట్ డిజైర‌బుల్ .. మ‌హేష్ లేడేం?

Update: 2019-05-17 10:37 GMT
టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ క్లబ్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ చేరేందుకు ఆస్కారం లేదా? ఆ జాబితాలో అత‌డి పేరు క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి? అంటే అస‌లు సంగ‌తి తెలిసింది. మ‌హేష్ ఈ జాబితాకు పోటీప‌డ‌డం స‌రికాదు. ఎందుకంటే అత‌డు ``మోస్ట్ ఫ‌రెవ‌ర్ డిజైర‌బుల్ క్ల‌బ్`` కి స‌రిపోతార‌ని ప్ర‌ఖ్యాత టైమ్స్ నిర్ణ‌యించింది. బాలీవుడ్ స్టార్ హీరోలు స‌ల్మాన్.. షారూక్.. అమీర్ .. అక్ష‌య్ కుమార్ ల‌తో పాటు మ‌హేష్ ఈ జాబితాకు చెందుతార‌ని టైమ్స్ ప్ర‌క‌టించింది.

ఈ ప్ర‌క‌ట‌న‌తో మోస్ట్ ఫ‌రెవ‌ర్ డిజైర‌బుల్ జాబితాలో చేరిన మొట్ట‌మొద‌టి సౌత్ హీరోగా మ‌హేష్ పేరు రికార్డుల‌కెక్కింది. 50 మంది డిజైర‌బుల్ మెన్ జాబితాలో మ‌హేష్ పేరు క‌నిపించ‌క‌పోయినా కంగారు ప‌డాల్సిందేమీ లేదు. అన్నివేళ‌లా ప్రేరేపించే.. ప్ర‌భావితం చూపించే హీరోల జాబితాలో మ‌హేష్ పేరు చిర‌స్థాయిగా నిలుస్తుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు.

చేసే వృత్తిలో ఇన్వాల్వ్ మెంట్.. అన్ని క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే టాప్ స్టార్ల‌కు మాత్ర‌మే ఫ‌రెవ‌ర్ డిజైర‌బుల్ క్ల‌బ్ లో చోటు ద‌క్కుతుంది. మ‌హేష్ ఈ క్ల‌బ్ లో చేరి త‌ర్వాతి జ‌న‌రేష‌న్ కి కొత్త దారి చూపించాడు. ఇక‌పోతే విజ‌య్ దేవ‌ర‌కొండ తెలుగు హీరోల్లో మోస్ట్ డిజైర‌బుల్ జాబితాలో టాప్ 1 స్థానాన్ని ద‌క్కించుకున్నారు. రానా... ప్ర‌భాస్ పేర్లు రేసులో అత‌డి కంటే వెన‌క‌బ‌డ‌డంపై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.


Tags:    

Similar News