• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ పాత్రకు ఆయనే కరెక్ట్...

ఆ పాత్రకు ఆయనే కరెక్ట్ అంటున్న జక్కన్న

By - Tupaki Desk
Update: 2020-04-07 11:50 GMT
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ - ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన లోగోను మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. అంతేకాకుండా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ లుక్ ని విడుదల చేసింది. ఈ ఫ‌స్ట్ లుక్ వీడియో ప‌లు భాష‌ల‌లో విడుద‌లై ప్రేక్షకుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ - చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి అజయ్ దేవగన్ ని తీసుకోవడానికి గల కారణం గురించి రాజమౌళి తాజాగా ఓ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు. ఈ సినిమా కంటే ముందు ఈగ సినిమాను హిందీలో విడుదల చేయాలని జక్కన్న అనుకున్నప్పుడు అజయ్‌ - కాజోల్‌ ను కలిశారట. హిందీ వెర్షన్‌ కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చేందుకు ఇద్దరు వెంటనే ఒప్పుకొన్నారట. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ కోసం కలిసి పని చేస్తున్నట్లు తెలిపాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర చాలా గొప్పగా ఉంటుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. అయితే ఈ పాత్ర కోసం ఉండాల్సిన లక్షణాలు - నాకు ఉన్న అవసరాలు కొంత మందికి చెప్పి - సలహా అడిగిన క్రమంలో పదిలో తొమ్మిది మంది అజయ్‌ దేవగణ్‌ పేరు చెప్పారు. పాత్ర గురించి చెప్పగానే ఒప్పుకున్నందుకు చాలా అనందంగా ఉందన్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.



Tags:    
  • Why Did Rajamouli Pick Ajay Devgn For RRR 
  • RRR 
  • Ss Rajamouli 
  • Tollywood 
  • Jr Ntr 
  • Ram Charan 
  • Alluri Sita Rama Raju 
  • Koamaram Bheem 
  • Tollywood Latest Updates 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

Copyright @2026

Powered by Blink CMS