6 నిమిషాల సీక్వెన్స్ కోసం 6 కోట్లు ఖర్చు చేస్తున్నారట...!
టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన లెక్కల మాస్టర్ సుకుమార్ తీస్తున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప'. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. సుక్కు ఆస్థాన సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ 'పుష్ప'కి సంగీతాన్ని అందిస్తున్నారు. బన్నీ - సుక్కు కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అందరి కళ్ళు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి. అంతేకాకుండా 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ రూపొందిస్తున్న సినిమా కావడం.. 'అల వైకుంఠపురంలో' సినిమా తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
శేషాచలం అడవుల్లో రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో నిలిపివేయబడింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా పక్కా మాస్ రోల్స్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ అంచనాలను పెంచేసింది. రాయలసీమ చిత్తూరు యాస, భాషతో పాటు బన్నీ ఊర మాసు.. మొరటు కుర్రాడిగా ఇరగదీస్తాడనిపిస్తుంది. దీని కోసం అల్లు అర్జున్ ఇప్పటికే శిక్షణ కూడా పొందుతున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట సుక్కు.
ఈ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ భారీగా డిజైన్ చేసారంట సుకుమార్. 6 నిమిషాలు ఉండే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 6 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని సమాచారం. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ తో కాకుండా ఇక్కడి వాళ్ళతోనే తీయబోతున్నట్లు సమాచారం. కాగా 'పుష్ప' సినిమాని పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీల నటీనటులు కూడా 'పుష్ప'లో నటిస్తున్నారని సమాచారం. కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం మిగతా షూటింగ్ ని పూర్తి చేసి వీలైనంత త్వరగా 'పుష్ప' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.