అటు ఇటు తిరిగి మళ్ళీ ఆమె వద్దకు పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే.;

Update: 2026-04-22 06:58 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో చరణ్ మాస్ యాంగిల్ ను హైలైట్ చేసేందుకు మేకర్స్ ఒక క్రేజీ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు. గతంలో చరణ్ సినిమాల్లో వచ్చిన 'జిగేలు రాణి', 'పింపుల్ డింపుల్' వంటి సాంగ్స్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సౌండ్ చేశాయో గుర్తుంది కదా. ఇప్పుడు ‘పెద్ది’ కోసం కూడా అంతకు మించిన ఒక మాస్ నంబర్ రెడీ అవుతోంది.

అయితే ఈ పాటలో చరణ్ తో కలిసి స్టెప్పులేసే ఆ హీరోయిన్ ఎవరనే దానిపై గత కొన్నాళ్లుగా రకరకాల పేర్లు వినిపించాయి. మొదట్లో మృణాల్ ఠాకూర్, సంయుక్త మీనన్ వంటి పేర్లు వినిపించినా, ఇప్పుడు ఈ రేసులోకి శ్రుతి హాసన్ ఎంట్రీ ఇచ్చినట్లు ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తోంది. చరణ్, శ్రుతి హాసన్ కలిసి గతంలో 'ఎవడు' సినిమాలో సందడి చేశారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఒక స్పెషల్ సాంగ్ అంటే అది కచ్చితంగా ఫ్యాన్స్ కు కన్నుల పండగే.

అయితే ఈ పాట కోసం శ్రుతికి భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్. స్పెషల్ సాంగ్ కోసం ఖర్చు విషయంలో మేకర్స్ అసలు వెనక్కి తగ్గడం లేదని, శ్రుతి అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. కోట్లలోనే ఈ సాంగ్ బడ్జెట్ ఉండబోతోందని సమాచారం. శ్రుతి హాసన్ కు గతంలో ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. మహేష్ బాబు 'ఆగడు' సినిమాలో ఆమె చేసిన పాట అప్పట్లో ఒక ఊపు ఊపింది.

ఇప్పుడు చరణ్ సినిమా కోసం మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో శ్రుతి నుంచి పెద్దగా సినిమాలు రాకపోవడంతో, ఈ సాంగ్ సక్సెస్ అయితే ఆమె కెరీర్ కు కూడా మంచి బూస్ట్ దొరుకుతుంది. అందుకే ఆమె కూడా ఈ ఆఫర్ పట్ల పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకున్నా, ఈ సాంగ్ షూట్ పూర్తి చేస్తే దాదాపు పనులు అయిపోయినట్లే. మేకర్స్ ఈ ప్రాజెక్ట్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు.

షూటింగ్ కొంత ఆలస్యమైనా పర్లేదు కానీ, ప్రతి ఎలిమెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలని బుచ్చిబాబు పట్టుబడుతున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అదిరిపోయే మాస్ ట్యూన్ ఇచ్చారని, దానికి తగ్గట్టుగానే భారీ సెట్టింగ్ లో ఈ పాటను చిత్రీకరించబోతున్నారని సమాచారం. శ్రుతి హాసన్ ఎనర్జీ చరణ్ డ్యాన్స్ కు తోడైతే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను విజువల్ గా చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అయితే, శ్రుతి హాసన్ ఈ సినిమాలో నటిస్తుందనే విషయంపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం వినిపిస్తున్నవన్నీ కేవలం ఇండస్ట్రీ టాక్ మాత్రమే. నిజంగానే శ్రుతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News