వెంకీ ల్యాండ్ మార్క్ మూవీ జాక్ పాట్ కొట్టేదెవరు?
ఎంతో గొప్ప సక్సెస్ రేటు ఉంటే కానీ నేటి రోజుల్లో హీరోలకు మనుగడ కష్టం. అలాంటిది 50వ సినిమా.. 75వ సినిమా.. 100 వ సినిమా.. అంటూ ఒక్కో మెట్టు ఎక్కడం ఏ హీరోకి అయినా ప్రత్యేకమే. కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీగా పరిగణించి ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ అలాంటి ప్రయత్నంలోనే ఉన్నారు. వెంకీ కెరీర్ ల్యాండ్ మార్క్ (వెంకీ 75) మూవీ కోసం ఇప్పటినుంచే డి.సురేష్ బాబు చేస్తున్న ప్రయత్నాలు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారాయి.
వరుసగా పలువురు అగ్ర దర్శకులు వినిపించిన స్క్రిప్టుల్ని సురేష్ బాబు విన్నారు. ఇందులో పూరి జగన్నాథ్.. త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకులతో పాటు కిశోర్ తిరుమల కూడా ఉన్నారు. ఇక వీళ్లతో పాటే తరుణ్ భాస్కర్ కి వెంకీ -సురేష్ బాబు బృందం ఓ సినిమాకి కమిట్ మెంట్ ఇచ్చారు. అయితే వెంకీ 75 పైనే అందరి దృష్టి నిలిచి ఉంది. త్రివిక్రమ్ లేదా పూరీ.. ఎవరో ఒకరికి ఆ అవకాశం ఉంటుందా? అన్నది కాస్త ఆగితే కానీ క్లారిటీ రాదు.
మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాల మైలు రాయిని చేరుకోగా.. ల్యాండ్ మార్క్ మూవీగా ఖైదీనంబర్ 150లో నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అలాగే నందమూరి బాలకృష్ణ కెరీర్ 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి బంపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు వెంకీ టైమ్ వచ్చింది. కెరీర్ 75వ సినిమాతో ఎట్టి పరిస్థితిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సత్తా చాటాలన్న పంతం నాయుడు గారి కాంపౌండ్ లో కనిపిస్తోంది. అందుకోసం కసరత్తు అంతే ఇదిగా ఉంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న `నారప్ప` కోవిడ్ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇది విక్టరీ వెంకటేష్ కెరీర్ 74వ సినిమా.