టాలీవుడ్ లో 'ఫిట్ అండ్ హాట్' హీరోయిన్ ఎవరు..?

Update: 2020-09-17 07:30 GMT
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం 'ఫిట్ అండ్ హాట్' గా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. స్క్రీన్ మీద ఎంతగా అందచందాలు ఎర వేయాలంటే దానికి బాడీ ఫిట్నెస్ కూడా తోడవ్వాల్సిందే. హీరోయిన్స్ కి ఎన్ని హిట్స్ అందుకున్నా ఎంత క్రేజ్ తెచ్చుకున్నా స్టార్ స్టేటస్ అనేది కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది.. సినిమా ఆఫర్స్ ఉంటేనే రేస్ లో ఉంటారు. అందుకే ఆఫర్స్ దక్కించుకోవడం కోసం గ్లామర్ ని మైంటైన్ చేయడంతో పాటు రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ బాడీని ఫిట్ గా కూడా ఉంచుకుంటారు. ఒకప్పుడు హీరోయిన్ అంటే సంప్రదాయబద్ధంగా ఉండేవారు.. యాక్టింగ్ వస్తే సరిపోతుంది... బొద్దుగా ఉన్నా పర్వాలేదు అనుకునేవారు. రాను రాను సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత తగ్గిపోయి నటీమణుల గ్లామర్ షోకి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్ అయినా సరే అమ్మడు అందాలు ఆరబోస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.. ఫిలిం మేకర్స్ అవకాశాలు ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే చాలామంది హీరోయిన్స్ బికినీలు వేయడానికి.. గ్లామర్ షో చేయడానికి సిద్ధపడే వస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నవారిలో చాలామంది అందం మీదే కాకుండా ఫిట్నెస్ పై కూడా ఫోకస్ పెడుతున్నారు. పార్లర్ కి వెళ్లడమే కాకుండా జిమ్ లకు వెళ్తూ కఠోర వ్యాయామాలు చేస్తున్నారు. గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూ.. బరువులు ఎత్తుతూ చెమటలు కక్కిస్తున్నారు. ఈ క్రమంలో సన్నగా సన్నజాజిలా మారి ఫిట్ గా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న ముద్దుగుమ్మల్లో ఫిట్ గా ఉండటంతో పాటు హాట్ గా ఉండే హీరోయిన్ ఎవరు అని 'తుపాకీ డాట్ కామ్' లో ఒక పోల్ పెడితే ఓటింగ్స్ ఈ విధంగా వచ్చాయి. మొత్తం పోలైన ఓట్స్ లో 42.87% మంది పూజా హెగ్డే  'ఫిట్ అండ్ హాట్' గా ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కి 22.42% మంది ఓటేశారు. ఇక అక్కినేని సమంత 16.25%.. కాజల్ అగర్వాల్ 12.97%.. ప్రగ్యా జైస్వాల్ 5.49% మంది ఫిట్ అండ్ హాట్ గా ఉంటారని పేర్కొన్నారు. దీనిని బట్టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన పూజా హెగ్డేకి ఈ పోల్ లో అత్యధికమంది ఓటేశారు.
Tags:    

Similar News