రణవీర్ vs షారుక్..? సోషల్ మీడియాలో ఊహాగానాలకు తెరలేపిన క్లిప్!
బాలీవుడ్‌లో స్టార్‌ల మధ్య సంబంధాలపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో రీసెంట్ గా భారీ సక్సెస్ ను అందుకున్న ధురంధర్ 2 నేపథ్యంలో ఈ చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి.;
బాలీవుడ్‌లో స్టార్‌ల మధ్య సంబంధాలపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో రీసెంట్ గా భారీ సక్సెస్ ను అందుకున్న ధురంధర్ 2 నేపథ్యంలో ఈ చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వ్యాఖ్యలు, ఊహాగానాలు పరిశ్రమలోని అంతర్గత సమీకరణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
రీసెంట్ గా ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీ ఈ చర్చలకు కేంద్రబిందువైంది. ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంలో షారుఖ్ ఖాన్ మరియు రణ్‌వీర్ సింగ్ మధ్య జరిగిన చిన్న పరస్పర చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ధురంధర్ ఫ్రాంచైజ్ సక్సెస్ తో ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న రణవీర్ సింగ్ ఈ పార్టీలో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్న ఒక చిన్న వీడియో క్లిప్ ఆధారంగా కొందరు వినియోగదారులు రణవీర్ సింగ్, షారుక్ ఖాన్‌ను పట్టించుకోలేదని అభిప్రాయపడుతున్నారు. వీడియోలో షారుక్ రణవీర్‌ను ఆత్మీయంగా పలకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించగా, రణవీర్ రియాక్షన్ లిమిటెడ్‌గా ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. షారుక్ ఖాన్ ధురంధర్2 సక్సెస్ పై రెస్పాండ్ అవకపోవడం కూడా చర్చకు దారితీసింది. ఇతర భాషా చిత్రాలకు ఆయన సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేసినా, ఈ సినిమాపై మాత్రం ఎలాంటి పోస్టు చేయకపోవడం కొందరికి సందేహాలను కలిగించింది. దీనిని కొందరు జెలసీగా అభివర్ణిస్తూ, బాలీవుడ్‌లో పోటీ భావన పెరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, ఈ మొత్తం పరిస్థితిని విశ్లేషిస్తే, ఒక చిన్న వీడియో క్లిప్ ఆధారంగా ఇంత పెద్ద నిర్ణయాలకు రావడం సరైన కాదనే చెప్పాలి. ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో జరిగిన కొన్ని క్షణాల పరస్పర చర్యను పూర్తిగా అర్థం చేసుకోకుండా, దానికి వివిధ అర్ధాలు ఇవ్వడం తగదని, అక్కడ ఉన్న వాతావరణం, వ్యక్తిగత పరిస్థితులు, ఇతర సంభాషణలు వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. పైగా షారుక్ ఖాన్, రణవీర్ సింగ్ మధ్య స్పష్టమైన విభేదాలున్నాయని నిర్ధారించే విధంగా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం కూడా లేదు. బాలీవుడ్‌లో స్టార్‌ల మధ్య పోటీ సహజమే అయినా, అది వ్యక్తిగత విభేదాలుగా మారిందని చెప్పడానికి మాత్రం ఆధారాలు కావాలి. కానీ ఇక్కడ వారిద్దరి మధ్య విభేదాలున్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవు.