ఆమెకోసం ఇద్దరు స్టార్ హీరోల ఫైట్..

Update: 2020-04-10 02:15 GMT
సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య అఫైర్లు, రూమర్లు వినిపించడం మాములే. కానీ అఫైర్స్ గోల బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఉంటుంది. అయితే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అఫైర్ల విషయానికి వస్తే గతంలో రూమర్లు ఎన్నో వినిపించాయి. సల్మాన్ తన ఫస్ట్ ప్రేయసి సంగీత బిజ్లానీ విషయంలో మాత్రం అప్పట్లో గొడవ కూడా పడ్డాడట. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ అనే సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. సంగీత బిజ్లానీ గురించి సల్మాన్-జాకిల మధ్య జరిగిన గొడవ ఇప్పుడు మీడియాలో మరోసారి చర్చనీయ అంశంగా మారింది.

ఇక ఎప్పుడైనా సల్మాన్ ఖాన్‌కు ఫస్ట్ లవర్ ఎవరంటే సంగీత బిజ్లానీ అనే విషయం అందరికి తెలిసిందే. అయితే సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేసే టైమ్ లో సంగీత జాకీ ష్రాఫ్‌తో నటించి మెప్పించింది.అప్పట్లో జాకీ, సంగీత కెమిస్ట్రీకి ఇప్పటికి ఫ్యాన్స్ ఉన్నారు. విషయం తెలియడంతో సల్మాన్‌కు ఆగ్రహం వచ్చిందట. ఇక అలాంటి టెన్షన్ పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్ బంధన్ అనే చిత్ర షూటింగ్‌కోసం వారిద్దరి మధ్య మాటా మాట పెరిగి ఇద్దరి మధ్య గొడవకు దారి తీసిందట. అలాగే వారిద్దరు ఓ రేంజ్‌లో ఫైట్ చేయడానికి సిద్ధం కావడంతో ఇద్దరు ఫైట్ కి సిద్దమవుతుంటే.. జాకీ, సల్మాన్ లను సంగీత బిజ్లానీ బంధన్ సెట్స్‌లోకి వచ్చి అఫైర్స్ డేటింగ్ విషయాల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పిందట. దాంతో తనకు, జాకీ మధ్య వస్తున్న గాసిప్స్‌ కు కూడా సంగీత బిజ్లానీ తెర వేసిందని సల్మాన్ చెప్పుకొంటున్నట్లు ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.
Tags:    

Similar News