పాన్ ఇండియా...సీనియర్స్‌కు అంత ఈజీ కాదా?
`బాహుబలి` తరువాత టాలీవుడ్‌లో వినిపిస్తున్న ఒకే ఒక్క పదం పాన్ ఇండియా. చిన్న హీరోల నుంచి బిగ్ స్టార్స్ వరకు ఇదే మంత్రం పఠిస్తున్నారు.;
`బాహుబలి` తరువాత టాలీవుడ్‌లో వినిపిస్తున్న ఒకే ఒక్క పదం పాన్ ఇండియా. చిన్న హీరోల నుంచి బిగ్ స్టార్స్ వరకు ఇదే మంత్రం పఠిస్తున్నారు. కానీ అందులో కొంత మంది మాత్రం సక్సెస్ అవుతున్నారు.. పాన్ ఇండియా మార్కెట్‌ని గ్రాబ్ చేసి బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్ల గొట్టేస్తున్నారు. కానీ మన టాలీవుడ్ సీనియర్ స్టార్స్‌కు మాత్రం పాన్ ఇండియా అందని ద్రాక్షే అవుతోంది. పాన్ ఇండియా రేసులో యంగ్ హీరోలతో పాటు క్రేజీ స్టార్స్ దూసుకెళ్తుంటే సీనియర్స్ మాత్రం తడబాటుకు గురవుతున్నారు.
పాన్ ఇండియా పేరు చెబితే వెనకడువేస్తున్నారు. నిఖిల్ నుండి ప్రభాస్ వరకు అంతా పాన్ ఇండియా సినిమాలతో మార్కెట్‌ని సెట్ చేసుకుంటూ తమ పరిథిని పెంచేసుకుంటుంటే సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మాత్రం ఆ పేరు చెబితే వెనకాడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, నాని, నిఖిల్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్‌గా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆ స్థాయి మార్కెట్‌ని సృష్టించుకున్నారు.
వారిలా ట్రై చేసిన సీనియర్స్ మాత్రం వెనకబడిపోయారు. సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని అలరించాలి అనుకున్నారు. ఐదు భాషల్లో రిలీజ్ కూడా ప్లాన్ చేశారు. కానీ తెలుగులో తప్ప ఈ సినిమాకు ఎక్కడా ఆదరణ లభించలేదు. దీంతో చిరు పాన్ ఇండియా ఆలోచనలని విరమించుకుని టాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టారు.
ఇక నందమూరి బాలకృష్ణ కూడా చిరు తరహాలో పాన్ ఇండియా జపం చేశారు. `అఖండ 2`తో ఆ ఫీట్‌ని చేయాలని భావించారు. కానీ నో యూజ్. తెలుగులోనే పెద్దగా వర్కవుట్ కానీ `అఖండ 2` ఇతర భాషల్లో వర్కవుట్ కాదని గ్రహించారు. దాంతో పాన్ ఇండియా ఆలోచనలని పక్కన పెట్టి కేవలం టాలీవుడ్‌కే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారట.
వీరి తరహాలో నాగార్జున ట్రై చేయలేదు. కారణం అది వర్కువుట్ కాదని తనకి తెలుసు. అందుకే నాగ్ పాన్ ఇండియా మాట ఎత్తలేదు. వెంకటేష్ మాత్రం `సైంధవ్`తో పాన్ ఇండియా మూవీ ట్రై చేశాడు. తెలుగులోనే ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి షాక్ ఇవ్వడంతో వెంకీ మామ పాన్ ఇండియా మాటే ఎత్తడం లేదు. కేవలం టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టి ఫ్యామిలీస్‌ని ఎంటర్ టైన్ చేసే `సంక్రాంతికి వస్తున్నాం` లాంటి సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చాడట. తాము నటించిన సినిమాలు పాన్ ఇండియా కాకపోవడంతో గత అనుభవాలని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్‌కే పరిమితం కావాలని సీనియర్ హీరోలు నిర్ణయించుకున్నారట.