న‌డిరోడ్డుపై వేధించిన ఆ ఆక‌తాయి ఎవ‌రు?

Update: 2020-06-23 12:10 GMT
తెలుగు ఇండ‌స్ట్రీలో రాణించిన త‌మిళ‌మ్మాయిల జాబితాలో త్రిష త‌ర్వాత అంత‌గా వేరొక పేరు క‌నిపించ‌లేదు. అయితే ఉన్నంత‌లో యువ నాయిక రెజీనా మాత్రం తెలుగులో వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంద‌నే చెప్పాలి. తెలుగు-త‌మిళం రెండు చోట్లా అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూనే ఉంది.

తాజాగా రెజీ చాలా సార్లు లైగింక వేదింపులకు గురయ్యాను అంటూ వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపింది. త‌న‌ను శారీర‌కంగా లొంగ‌దీసుకునేందుకు ప‌లువురు ప్ర‌య‌త్నించార‌ట‌. వేధింపులు ఎదుర‌య్యాయి. అలాగే త‌న‌ని వేధించాల‌ని చూసిన ఒక యువ‌కుడిని ప‌బ్లిక్ ముందే చిత‌క్కొట్టాన‌ని కూడా తెలిపింది. మిస్టర్ చంద్రమౌళి సినిమా ప్రమోషన్‌ సందర్భంగా రెజీన ఈ సంచ‌ల‌న విష‌యాన్ని వెల్లడించింది.

కాలేజ్‌ డేస్ ‌లో వేధింపుల్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్న రెజీ చాలా ఆస‌క్తిక‌ర విష‌యాల్ని రివీల్ చేసింది. ఓసారి చెన్నైలోని ఓ పాపురల్‌ థియేటర్ వ‌ద్ద కొంద‌రు బోయ్స్ త‌న‌ను వేధించార‌ట‌. అలాగే అదే న‌గ‌రంలో ఇగా థియేటర్‌ బ్రిడ్జ్ వ‌ద్దా త‌న‌తో పాటు న‌లుగురు స్నేహితురాళ్ల‌ను కొంద‌రు వేధించార‌ట‌. న‌డిరోడ్ పై ఓ కుర్రాడు త‌న పెద‌వుల్ని తాకేందుకు ట్రై చేసాడ‌ని వెల్ల‌డించింది. సున్నితంగా ఉంటే ఇలాంటి చేష్ఠ‌లు ఎదుర‌వుతాయ‌ని ధృఢంగా ఉండాల‌ని అమ్మాయిల‌కు హిత‌భోధ చేసింది.

అప్ప‌ట్లో ఓ తెలుగు యువ‌హీరోతో నిండా ప్రేమ‌లో ప‌డింద‌ని ఆ క్ర‌మంలోనే కెరీర్ డిస్ట్ర‌బ్ అయ్యింద‌ని ప్ర‌చార‌మైంది. ఆ త‌ర్వాత అన్నిటి నుంచి కంబ్యాక్ అయ్యేందుకు రెజీనా హార్డ్ వ‌ర్క్ చేస్తోంది. ఈ అమ్మ‌డు న‌టించిన త‌మిళ్ - తెలుగు ద్విభాషా చిత్రం పార్టీ రిలీజ్ కి రావాల్సి ఉంది. దీంతో పాటే నేంజమ్ మ‌ర‌ప్ప‌థిల్లై- క‌స‌డ త‌ప‌ర‌- క‌ల్లాప‌ర్ట్ అనే చిత్రాల్లో న‌టిస్తోంది.  టాలీవుడ్ లో స‌రైన ఆఫ‌ర్ కోసం ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News