యువ‌హీరో పెళ్లికొడుకై గుర్ర‌మెక్కేదెపుడు? తండ్రి క‌ల నెర‌వేర్చ‌డా?

Update: 2021-09-04 16:30 GMT
అగ్ర క‌థానాయిక‌ల‌తో బాలీవుడ్ యువ‌హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ ఎఫైర్ల గురించి ప్ర‌తీది బ‌హిర్గ‌త‌మే. ముందుగా దీపికా ప‌దుకొణే తో డీప్ ల‌వ్ లో మునిగి తేలాడు. ఇద్ద‌రు పెళ్లి వ‌ర‌కూ వెళ్లారు. కానీ చివ‌రి నిమిషంలో సీన్ తారుమారైంది. మ‌న‌స్ప‌ర్ధ‌లు కార‌ణంగా దూర‌మ‌య్యారు. ఈ బ్రేక‌ప్ కి కార‌ణం మ‌ధ్య‌లో ప్ర‌వేశించి క‌త్రిన అంటూ ప్ర‌చార‌మైంది.

దీపిక‌-క‌త్రిన న‌డుమ ర‌ణ‌బీర్ డ‌బుల్ గేమ్ బ‌హిర్గ‌తం కావ‌డం వ‌ల్ల‌నే ఆ బ్రేక‌ప్ అన్న ప్ర‌చారం సాగింది.  త‌ర్వాత ర‌ణ‌బీర్ క‌త్రినాకైఫ్ తో ప్రేమాయ‌ణం కొన‌సాగించినా అదీ నిల‌బ‌డ‌లేడు. కొన్నాళ్ల‌పాటు వీళ్లిద్ద‌రి వ్య‌వ‌హారం కూడా చాలా సీరియ‌స్ గానే సాగింది.  ఇద్ద‌రు పెళ్లి బంధంతో ఒక‌ట‌వుతార‌ని బాలీవుడ్ మీడియా గ‌ట్టిగానే క‌థ‌నాల్ని హీటెక్కించింది. కానీ ఆబంధం ఎంతో కాలం నిలువలేదు. ప్ర‌తికూల  ప‌రిస్థితులు డిమాండ్ చేయ‌డంతో  మ‌ధ్య‌లోనే విడిపోయారు.

ఆ త‌ర్వాత మ‌హేష్ భ‌ట్ వార‌సురాలు అలియా భ‌ట్ తో ప్రేమాయ‌ణం మొద‌లు పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ జంట పెళ్లి వ‌ర‌కూ వెళుతోంద‌న్న ప్ర‌చారం ఉంది. ఈ జంట వెకేష‌న్స్ గురించి తెలిసిన‌దే. తీరిక‌ స‌మ‌యం దొరికితే బీచ్ వెకేష‌న్ల పేరుతో విదేశాల్లో షికార్లు చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల ఆ ఇద్ద‌రి మ‌ధ్యా  కూడా ఏదో తేడా జ‌రుగుతుంద‌నే బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తోంది.

ఇద్ద‌రి మ‌ధ్య ఎడబాటు త‌డ‌బాటుగా మారుతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ర‌ణ‌బీర్ వ్య‌క్తిత్వంపై అలియాకి ర‌క‌ర‌కాల సందేహాలున్నాయి. ఆ ర‌కంగా డిస్టెన్స్  మెయింటెన్ చేస్తుంద‌నే ప్ర‌చార‌మైతే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ ర‌ణ‌బీర్ ప్రేమ క‌హానీలు ఇలా ఉన్నాయి.

ఇక ఇంట్లో త‌ల్లిందండ్రుల ఆలోచన‌లు ఎలా ఉండేవో ఓసారి చూస్తే... ఇటీవ‌లే ర‌ణ‌బీర్ తండ్రి వెట‌ర‌న్ హీరో రిషీక‌పూర్ స్వ‌ర్గస్తులైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ర‌ణ‌బీర్ త‌ల్లి  నీతు క‌పూర్ కుమారుడి పెళ్లి కోసం తండ్రి ఎంతగా ఆరాట‌ప‌డేవారో వివ‌రించారు. ర‌ణ‌బీర్ ని పెషావ‌ర్ స్టైల్లో పెళ్లికోడుకు గెట‌ప్ లో రెడీ అయి.. గుర్ర‌మెక్కించి  ఊరేగిస్తూ చూడాల‌ని రిషీ క‌పూర్ క‌ల‌లు క‌నేవారుట‌.

ర‌ణ‌బీర్ వ‌య‌సుకు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి రిషీ ఆలోచ‌న‌ల‌న్ని కుమారుడి  పెళ్లి చుట్టూనే తిరిగేవ‌ని  నీతూ కపూర్ తెలిపారు. కానీ ఇప్పుడాయ‌న లేకుండా కుమారుడి పెళ్లి తానే చేయాల్సి వ‌స్తోంద‌ని  క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. మ‌రి తండ్రి కల‌ను కుమారుడు ఎప్పుడు నెర‌వేరుస్తాడో తెలీదు. ఇది విధిగా ర‌ణ‌బీర్ కపూర్ చేయాల్సిందే. తండ్రి వార‌స‌త్వంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాదు..తండ్రి క‌ల‌లు..ఆశ‌యాల్ని కూడా చేరుకోవాలి క‌దా అని అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News