ఏంటి.. 'మార్చి' మొత్తం వేస్ట్ చేస్తున్నారా?

కానీ ఇప్పుడు మళ్లీ వేసవిలో కీలకమైన మార్చి నెలను టాలీవుడ్ వేస్ట్ చేసుకుంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ అవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు.;

Update: 2026-01-27 10:30 GMT

టాలీవుడ్ బిగ్గెస్ట్ సీజన్ లో ఒకటైన సంక్రాంతి కంప్లీట్ అయినట్లే. ఇప్పటికీ ఆ సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు.. థియేటర్స్ లో సందడి చేస్తుండగా.. ఇప్పుడు అందరి దృష్టి వేసవిపై పడింది. ఎందుకంటే సమ్మర్ లో విద్యార్థులకు సెలవులు ఉంటాయి. దీంతో మూవీలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే ఆ సమయంలో కూడా సినిమాలు ఎక్కువగానే రిలీజ్ అవుతుంటాయి.

కానీ గత ఏడాది.. సమ్మర్ మొత్తం వేస్ట్ అయింది. ఒక్క భారీ సినిమా కూడా రిలీజ్ కాలేదు. అందుకు కారణం.. నిర్మాతల వద్ద సరైన ప్రణాళిక లేకపోవడమే.. పలు సినిమాలు విడుదల అవుతాయని అనుకున్నా.. ఏవి కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో సినీ ప్రియులు అంతా నిరాశ వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇకపై అలా జరగకుండా చూసుకోవాలని అంతా సూచించారు.

కానీ ఇప్పుడు మళ్లీ వేసవిలో కీలకమైన మార్చి నెలను టాలీవుడ్ వేస్ట్ చేసుకుంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ అవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. పలు చిత్రాలు రిలీజ్ చేస్తామని ఆయా మేకర్స్ అనౌన్స్ చేసినా.. కూడా పోస్ట్ పోన్ అవుతాయంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో మార్చిలో ఏ మూవీ కూడా వచ్చేటట్లు లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి.. షెడ్యూల్ ప్రకారం మార్చిలో పెద్ద సినిమాల విషయానికొస్తే.. పెద్ది, ది ప్యారడైజ్ చిత్రాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది, నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలు.. ఒక రోజు వ్యవధిలో విడుదల అవ్వనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఆ రెండు చిత్రాలు కూడా అనుకున్న డేట్ కు రావని ప్రచారం జరుగుతోంది.

అయితే ఆ రెండు కూడా పోస్ట్ పోన్ అయితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 27న విడుదల కావచ్చని వార్తలు వస్తున్నాయి. కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. మార్చి నెల మధ్యలో యంగ్ హీరోలు అడవి శేష్ డెకాయిట్, నిఖిల్ స్వయంభూ సినిమాలు రానున్నాయి. కానీ రెండు చిత్రాలు కూడా డౌటేనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో అదే నిజమైతే.. పెద్ది, ప్యారడైజ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా రాకపోతే.. మొత్తం మార్చి నెల అంతా వేస్ట్ అవ్వడం ఖాయం. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. నిర్మాతలు విడుదల తేదీలను స్పష్టంగా అనౌన్స్ చేయాలని, ప్రణాళిక లేకపోతే కచ్చితంగా సినీ ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందని చెబుతున్నారు. ఇకనైనా ప్లాన్ తో ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News