పవన్ సినిమా తర్వాత క్రిష్ చేయబోతున్నది ఇదే..!
ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అవ్వాలనుకుంటున్నాడు. కెరీర్ ఆరంభంలో కాస్త స్లోగా సాగిన ఆయన ప్రస్తుతం స్పీడ్ పెంచాడు. కమర్షియల్ సినిమాలు చేస్తూ దూసుకు పోతున్న క్రిష్ కు పవన్ 27 సినిమా చేసే అవకాశం దక్కింది. కరోనా కారణంగా పవన్ సినిమా ఆలస్యం అవ్వడంతో వైష్ణవ్ తేజ్ తో సినిమాను చేస్తున్నాడు. రకుల్ హీరోయిన్ గా రూపొందుతున్న ఆ సినిమా కొండ పొలెం నవల ఆధారంగా రూపొందుతున్నట్లుగా సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమాను ముగించి పవన్ కళ్యాణ్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.
2020 సంవత్సరం సమ్మర్ వరకు పవన్ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. పవన్ మూవీ పూర్తి అయిన వెంటనే మరో నవలను సినిమాగా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇప్పటికే క్రిష్ 'అతడు అడవిని జయించాడు' అనే నవలను సినిమాగా తీసుకు వచ్చేందుకు స్క్రిప్ట్ రెడీ చేశాడట. ప్రముఖ రచయిత కేశవరెడ్డి రచించిన అతడు అడవిని జయించాడు నవల ఎన్నో అవార్డులను దక్కించుకుంది.
ఒక ముసలి వ్యక్తి తన పంది పిల్ల అడవిలోకి వెళ్లి పోవడంతో దాన్ని వెదుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అడవిలో అతడు ఎదుర్కొన్న సంఘర్షణే నవల. దాన్ని సినిమాటిక్ గా రూపొందించేందుకు దర్శకుడు క్రిష్ సీనియర్ నటుడితో ప్లాన్ చేస్తున్నాడట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2022లో క్రిష్ ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.