సైలెంట్ అయిపోయిన నందమూరి హీరో ఏం ప్లాన్ చేస్తున్నాడంటే..?
నందమూరి నట వారసుడిగా 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు కళ్యాణ్ రామ్. వరుస ప్లాప్ లను చవి చూసిన తర్వాత నిర్మాతగా మారి ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించి 'అతనొక్కడే' సినిమా తీసి హిట్ అందుకున్నాడు. అయితే అంతలోనే అర డజనుకు పైగా ప్లాపులు చూసాడు. కాకపోతే 'పటాస్' సినిమాతో కళ్యాణ్ రామ్ కెరీర్ లో సూపర్ హిట్ అందుకుని ట్రాక్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో 'ఎంత మంచివాడవురా' అంటూ సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అప్పటి నుంచి కళ్యాణ్ రామ్ మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు.
ఇదిలావుండగా కళ్యాణ్ రామ్ హీరోగా కొనసాగుతూనే నిర్మాతగా కూడా ముందుకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ని నిలబెట్టడం కోసం రానున్న రోజుల్లో తమ్ముడు ఎన్టీఆర్ ని ముందు పెట్టి బ్యాక్ ఎండ్ లో తానే నిర్మాతగా సినిమాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నాడట. అలానే ఎన్టీఆర్ నటించే సినిమాలకు భాగస్వామిగా ఉండాలని చూస్తున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ -త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రాన్ని హారిక అండ్ హాసిని వారితో కలిసి నిర్మించనున్నారు. ఫ్యూచర్ లో కూడా ఇద్దరు కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ ని ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.