అసలు 'ప్రభాస్'తో నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటి..??
టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇప్పటివరకు చేసింది రెండు సినిమాలే. కానీ ఇంపాక్ట్ మాత్రం ఓ రేంజిలో క్రియేట్ చేసాడు. ఫస్ట్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యంతో డిఫరెంట్ మైండ్ సెట్ ఉందని అనిపించుకున్నాడు. కానీ సెకండ్ మూవీ మహానటితో ఒక్కసారిగా నేషనల్ వైడ్ ఫేమ్ అందుకున్నాడు. మహానటి సావిత్రి బయోపిక్ తెరకెక్కించి ఒక్కసారిగా ఇండియన్ మూవీ ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు నాగ్ తెరకెక్కించే మూడో సినిమా గురించి ఎప్పటికప్పుడు ఆసక్తి కలిగించే ట్వీట్స్ పెడుతూ ప్రేక్షకులను గ్రిప్ లో ఉంచుకుంటున్నాడు. అయితే మొదటిది తెలుగు వరకే పరిమితం చేసిన నాగ్.. సెకండ్ మూవీతో ఇండియా వైడ్ పాపులర్ అవ్వడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా రాబట్టుకున్నాడు.
ఇప్పుడు మూడో సినిమాను ఏకంగా వరల్డ్ వైడ్ ప్లాన్ చేసాడు. డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించనున్న ఈ సినిమా ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్లాన్ చేసాడు. నాగ్ అశ్విన్ కు టెక్నాలజీ - సైన్స్ ఫిక్షన్ జానర్స్ బాగా ఇష్టమట. అందుకే తను అనుకున్న వరల్డ్ లెవెల్ ఆలోచనను పాన్ వరల్డ్ మూవీగా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఆల్రెడీ ఆ సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసాడట. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. ఇంతలోనే మరో క్రేజీ న్యూస్ సినిమా గురించి వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందినా సినిమాలో అడ్వాన్సడ్ ఫ్యూచర్ చూపించనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే ఈ సినిమా హై లెవెల్ టెక్నాలజీతో మరి కొన్నేళ్లు ముందుకు తీసుకెళ్లబోతున్నారని తెలుస్తుంది.
ఇది ఎంతవరకు నిజమో గాని వినడానికి బాగానే ఉండంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కానీ అసలు నాగి ప్లాన్ ఏంటో అర్ధం కావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంటే.. అసలు ప్రభాస్ తో నాగ్ ఎలాంటి స్కేల్ మూవీ ప్లాన్ చేసాడో.. ఆ ఐడియా నిజంగానే ఆ లెవెల్లో ఉండబోతుందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకొనే కాగా కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. సి. అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. మరి ఫస్ట్ టైం ఈ సినిమాతో పాన్ వరల్డ్ వైడ్ తన మ్యూజిక్ వినిపించబోతున్నాడు మిక్కీ జే మేయర్. ఇంతటి భారీ టీమ్ కలిసి ఓ సాలిడ్ సై-ఫై విజయవంతంగా అందిస్తుందేమో చూడాలి.