• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేజీఎఫ్‌ కు కైకాలకు...

కేజీఎఫ్‌ కు కైకాలకు సంబంధం ఏంటీ?

By - Tupaki Desk
Update: 2021-11-22 07:44 GMT
కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్ కు సీక్వెల్‌ ఇప్పుడు విడుదలకు సిద్దం అవుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో వందల కోట్ల వసూళ్లను దక్కించుకున్న కేజీఎఫ్‌ సినిమా కన్నడ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమా అనడంలో సందేహం లేదు. అప్పటి వరకు 50 నుండి 60 కోట్ల వసూళ్లను భారీ వసూళ్లుగా భావించిన కన్నడ సినీ పరిశ్రమ కు కేజీఎఫ్ వందల కోట్లను చూపించి కంటెంట్‌ ఉంటే ఎక్కడైనా ఆడుతుందని నిరూపించింది. కేజీఎఫ్‌ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక బ్రాండ్ అనడంలో సందేహం లేదు. అలాంటి భారీ సినిమాను తెలుగు లో సమర్పించింది కైకాల సత్యనారాయన అనే విషయం తెల్సిందే.

కేజీఎఫ్ లో ఆయన నటించలేదు.. ఆయన నిర్మించలేదు.. ఆయనకు సంబంధించిన వారు ఎవరు ఉన్నారు ఆ సినిమాలో ఎందుకు ఆయన కేజీఎఫ్‌ ఎఫ్‌ ను సమర్పించారు అంటూ చాలా మంది చాలా రకాల అనుమానాలత ఉన్నారు. కైకాల సత్యనారయణ ను గౌరవించే ఉద్దేశ్యంతో ఆయన పేరును సమర్పకుడిగా వేసినట్లుగా కొందరు అనుకుంటున్నారు. కాని అసలు విషయం ఏంటీ అంటే కైకాల వారి వారసుడు నిర్మాతగా కన్నడ సినిమా రంగంలో ఉన్నాడు. ఆయనే కేజీఎఫ్‌ సినిమా కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా వ్యవహరించాడు. సినిమాకు వచ్చిన బజ్‌ నేపథ్యంలో తెలుగు లో కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి వచ్చి డబ్బింగ్‌ చేయడం జరిగింది.

ఆ సమయంలో సినిమాను తెలుగు లో కైకాల సత్యనారాయణ సమర్పిస్తే బజ్ ఎక్కువగా ఉంటుందని.. అలాగే ఆయన కు గౌరవం కల్పించినట్లుగా అవుతుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. కేజీఎఫ్ 2 ను కూడా కైకాల సమర్పణలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కేజీఎఫ్ టైటిల్‌ కు ముందే కైకాల వారి పేరును వేసి ఆయనకు సముచిత గౌరవంను ప్రశాంత్ నీల్‌ కల్పించాడు. ప్రస్తుతం కైకాల వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఎన్నో వందల సినిమాలను చేసిన కైకాల సత్యనారాయణ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం కుదుట పడి మళ్లీ ఆయన సినిమాల్లో కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Tags:    
  • KGF 
  • Rock str 
  • kaikala satyanarayana 
  • kaikala satyanarayana movie 
  • kaikala satyanarayana helth update 
  • kaikala satyanarayana 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS