కలువకళ్ల కుర్రపిల్ల ఏమైపోయిందబ్బా?

Update: 2021-01-25 01:30 GMT
హీరోయిన్ కి అందం అనేది మొదటి క్వాలిఫికేషన్ .. అందానికి ఇవ్వవలసిన మార్కులు ఇచ్చేయగా, ఆ తరువాత అడుగుబొడుగునా ఏవైనా మిగిలితే అప్పుడు అభినయానికి ఇవ్వొచ్చని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. అందాన్ని తెచ్చిపెట్టలేం .. అభినయమంటే ఎలాగోలా నేర్పించుకోవచ్చుననే దర్శక నిర్మాతలు భావిస్తుంటారు. అందువలన అందగత్తెలను మాత్రమే కథానాయికలుగా ఎంపిక చేస్తుంటారు. ఒక్కో కథానాయికలో ఒక్కో ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తూ ఉంటుంది. అలా అత్యంత ఆకర్షణీయమైన కళ్లు కలిగిన నాయికగా కేథరిన్ కనిపిస్తుంది.


కేథరిన్ కళ్లు మకరందం నింపుకున్న మత్తుపాత్రల్లా ఉంటాయి .. కుర్రాళ్ల గుండె కోట్లను కూల్చేసి మందుపాత్రల్లా ఉంటాయి. పూలు - పాలు కలిపిచేసినట్టుగా కనిపించే ఈ అమ్మాయి, 'ఇద్దరమ్మాయిలతో' సినిమాతో తన ఉనికిని చాటుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ, వాటిలో 'సరైనోడు' .. 'నేనేరాజు నేనేమంత్రి' సినిమాలు మాత్రమే ఆమెకి మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. ఆ తరువాత 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలోను చాలా గ్లామరస్ గా మెరిసింది. ఆ సినిమా పరాజయంపాలు కావడం వలన, సహజంగానే వెనుకబడిపోయింది.


నెలవంకకైనా వంకబెట్టవచ్చునేమోగానీ, గ్లామర్ పరంగా కేథరిన్ కి వంకబెట్టలేం. ఇక కోపం వచ్చినప్పుడు హీరోతో ఐ హేట్ యు అని చెప్పేసి ఏడవడానికీ, ప్రేమ ముంచుకొచ్చినప్పుడు ఐ లవ్యూ అని చెప్పేసి అల్లుకుపోయే యాక్షన్ ఆమె ఈజీగా చేయగలదు. కానీ ఎందుకనో తెలుగులో ఈ అమ్మాయికి అవకాశాలు తగ్గిపోతూ వస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులలో కూడా ఎక్కడా ఈ అమ్మాయి పేరు వినిపించడం లేదు. కావలసినంత అందం ఉంది .. అవసరమైనంత అభినయం ఉంది. మరి అవకాశాలు ఎందుకు రావడం లేదూ?! లౌక్యం లేకపోవడం వలన అనుకోవాలా? అదృష్టం లేకపోవడం వలన అనుకోవాలా?      
Tags:    

Similar News