ఉపాసన బిజీ వల్ల మాకు ఆ టైమే దొరికేది కాదు : చరణ్‌

Update: 2020-08-17 02:30 GMT
ఈ మద్య కాలంలో రామ్‌ చరణ్‌ మీడియాతో ఇంట్రాక్షన్‌ చాలా తక్కువ అయ్యాడు. ఎట్టకేలకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రామ్‌ చరణ్‌ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు. కరోనా కారణంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం మళ్లీ ఎప్పుడు ప్రారంభించే విషయంపై జక్కన్న నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు. అయితే ఖచ్చితంగా నన్ను సినిమాలో కొత్తగా చూస్తారంటూ చరణ్‌ హామీ ఇచ్చాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో చరణ్‌ అల్లూరి రామరాజు పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. మరో వైపు చరణ్‌ ఆచార్య చిత్రంలో కూడా చిన్న రోల్‌ లో కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా చరణ్‌ ఇంకా కథలు వింటున్నాడు. కొందరు యంగ్‌ డైరెక్టర్స్‌ వినిపించిన కథలు కూడా చరణ్‌ వింటున్నాడట. ఇక ఇంటర్వ్యూలో లాక్‌ డౌన్‌ అనుభవాల గురించి ప్రశ్నించగా కష్టంగా ఈ లాక్‌ డౌన్‌ టైం సాగుతుందని ఆయన పేర్కొన్నాడు.

మొదటి నెల రోజులు మరీ ఇబ్బంది అయ్యిందన్నాడు. మొదటి నెల రోజుల్లో ఉపాసన ఎక్కువగా తన ఆసుపత్రికి సంబంధించిన పనులతో బిజీగా ఉండేది. కేవలం తినే సమయంలో మాత్రమే మేము కలిసేవాళ్లం. మాకు సరదాగా మాట్లాడుకునే సమయమే దొరికేడి కాదు. ఆ నెల రోజులు నేను ఒంటరిగా ఇంట్లో క్వారెంటైన్‌ ఉండాల్సి వచ్చిందని చరణ్‌ నవ్వుతూ అన్నాడు. ప్రస్తుతం ఉపాసన ప్రస్తుతం తనతో ఎక్కువ సమయం కేటాయిస్తుందని చరణ్‌ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల వీరిద్దరు రానా పెళ్లికి అలాగే నిహారిక నిశ్చితార్థంకు హాజరు అయిన విషయం తెల్సిందే. వీరిద్దరి జోడీ రోజులు గుస్తూ ఉంటే మరింత చూడముచ్చటగా అవుతున్నారు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News