బాహుబలి ఫస్ట్‌ షో టాక్‌: ఒక యుద్దం

Update: 2015-07-10 04:08 GMT
ఒక్కడ్ని కాదు షేర్‌ ఖాన్‌, వంద మందిని ఒకేసారి పంపు అంటూ ఒకే సింగిల్‌ సీక్వెన్స్‌ షూట్‌ చేశాడు రాజమౌళి. అదంతా గడచిన మగధీర కథ. కాని ఇప్పుడు సీన్‌ మారింది. బాహుబలి టైమ్‌ వచ్చింది. ఈసారి అసలు యుద్దం అంటే ఏంటో తెలుగోళ్లకు రుచి చూపించి వదిలాడు ఈ క్రియేటివ్‌ మాష్టర్‌.

బాహుబలి సినిమాలో కాలికేయ అనే ఒక క్రూరమైన ఆటవిక రాజు కాలికేయుడితో తలపడే యుద్దానే కాలికేయ యుద్దంగా ప్రమోట్‌ చేశారు మనోళ్ళు. ఈ యుద్దం స్టార్టింగ్‌లో పడే పంచ్‌ డైలాగ్స్‌ నుండి యుద్దంలో చోటు చేసుకునే వివిధ ఎత్తులూ పైఎత్తులూ, కత్తి యుద్దం నుండి కోట గోడలు బద్దలు కొట్టే మరయంత్రాల వరకు.. అన్నీ గ్రాఫిక్స్‌లో రియలిస్టిక్‌గా డిజైన్‌ చేయడమే కాదు, వాటిని చాలా ఎఫెక్టివ్‌గా విజువలైజ్‌ చేశాడు రాజమౌళి. ముఖ్యంగా ప్రభాస్‌ చేపట్టిన యుద్దాలు భీకరంగా అసమానంగా ఉన్నాయి. బల్లాలదేవ రానా కూడా తక్కువేం కాదు. మనోడు కూడా ప్రభాస్‌కు పోటీగానే యుద్దంలో పాల్గొన్నాడు. గ్రాఫిక్స్‌ అనే ఫీలింగ్‌ రాకుండా ఈ యుద్దాన్ని చాలా బాగా డిజైన్‌ చేశారులే.

ఇప్పటివరకు మన తెలుగు తెరపై కాని బాలీవుడ్‌ తెరపై కాని ఇలాంటి యుద్దం మనం చూడలేదు. కేవలం హాలీవుడ్‌ సినిమాల్లోనే చూశాం. అందుకే ఇది సినిమా చరిత్రలో ఎప్పటికీ సజీవంగా నిలిచిపోయే 'ఒక యుద్దం'.

Tags:    

Similar News