మాటిస్తే మ‌డ‌మ తిప్ప‌ని ‌మ‌హారాజు అనేశాడు

Update: 2020-11-04 08:30 GMT
మెగా డైరెక్ట‌ర్ వీవీ వినాయ‌క్ కి రామ్ చ‌ర‌ణ్ .. తార‌క్ ఎంత‌టి స‌న్నిహితులో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఆ ఇద్ద‌రితో ఇప్ప‌టికే వినాయ‌క్ సినిమాలు చేశారు. అంతేకాదు ఆ ఇద్ద‌రినీ ఎంతో క్లోజ్ గా చూసిన ద‌ర్శ‌కుడు కూడా ఆయ‌న‌. అందుకే ఆ ఇద్ద‌రిపై ఆయ‌న అభిప్రాయాలు ఆస‌క్తిని రేకెత్తించాయి.

ముఖ్యంగా  రామ్ చ‌ర‌ణ్ గురించి మాట్లాడుతూ.. అత‌డి మాటంటే మాటే. మాటిస్తే ఇక రాయ‌ల్ తీరుగానే ఉంటాడు అని వినాయ‌క్ ప్ర‌శంసించారు. త‌న తండ్రికి రోల్స్ రాయిస్ కొనాల‌ని ఉంద‌ని అంటే వెంట‌నే బ‌ర్త్ డేకి గిఫ్ట్ గా కొనిచ్చాడ‌ని .. మ‌రో బ‌ర్త్ డేకి సైరాను గిఫ్ట్ గా ఇచ్చాడ‌ని వినాయ‌క్ అన్నారు. చిరు చిత్రం ‘సైరా’ నిర్మాణ సమయంలో రామ్ చరణ్ తన తారాగణం సిబ్బంది కోసం మంచినీళ్ల‌లా డ‌బ్బు ఖ‌ర్చు చేశార‌ని తెలిపారు. అతను తన టీమ్ లోని ప్రతి ఒక్కరూ విదేశాలలో ఉన్నప్పుడు తగినంత డబ్బు ఉండేలా చూసుకున్నాడు.

వారితో సమానంగా ప్రవర్తించాడు. ఇతరుల సౌలభ్యం కోసం ఎవరూ అంత డబ్బు ఖర్చు చేయరు అని తెలిపారు. రామ్ చరణ్ ఒక దర్శకుడికి ఒక మాట ఇస్తే ఆ దర్శకుడు అపజయంలో ఉన్నా..తన మాటను వెనక్కి తీసుకోడు అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు వినాయ‌క్.

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌స్థావిస్తూ.. అత‌డు అసాధారణమైనవాడ‌ని.. తెలివైనవాడు అని కితాబిచ్చారు విన‌య్. ఈ తరం నటులలో చాలామందికి లేని పనితీరు సామర్థ్యాలు ఎన్టీఆర్ కి ఉన్నాయి అని పొగిడేశారు. అన్న‌ట్టు మెగాస్టార్ చిరంజీవి ని అన్న‌య్యా అని ఆప్యాయంగా పిలిచే వినాయ‌క్ .. ఆ ఇంట్లో స‌భ్యుడితో స‌మానం అన్న సంగ‌తి తెలిసిన‌దే. చిరుని ఖైదీనంబ‌ర్ 150 చిత్రంతో గ్రాండ్ గా రీలాంచ్ చేసిన ఘ‌న‌త ప్రియాతి ప్రియ‌మైన త‌మ్ముడు వినాయ‌క్ కే  ద‌క్కింది.
Tags:    

Similar News