సీనయ్య ఇక పూర్తిగా అటకెక్కినట్లేనా?
యాక్షన్ సినిమాలంటే ఇలా ఉండాలి అనిపించే సినిమాలు తీసిన దర్శకుడు.. ఫ్యాక్షన్ సినిమాలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు వివి వినాయక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి దర్శకుడు ప్రస్తుతం కెరీర్ పరంగా కిందా మీద పడుతున్నాడు. దర్శకుడిగా ఫ్లాప్ అవ్వడంతో కనీసం నటుడిగా అయినా ఇండస్ట్రీలో కొనసాగుదాం అనుకున్న వినాయక్ కు ఈ విధంగా కూడా టైం కలిసి రావడం లేదు. నటుడిగా సీనయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న వినాయక్ అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.
గతంలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు నటుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. ఆయన కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. అలా తను కూడా నటుడిగా బిజీ అవ్వాలనుకున్నాడు. కాని వినాయక్ సీనయ్య సినిమా మొదలు పెట్టినప్పటి నుండి కూడా స్క్రిప్ట్ విషయంలోనో లేదా మరో రకంగానో వార్తల్లో ఉంటూనే ఉంది. ప్రారంభించిన సమయంలో అనుకున్న దాని ప్రకారం తీసుకుంటా పోతే ఈ పాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది.
షూటింగ్ ను పలు సార్లు ఆపేసి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తూ రావడంతో సినిమా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ సినిమాకు అధికారికంగా దిల్ రాజు నిర్మాత అయినా కూడా వినాయక్ కూడా భారీ మొత్తంను ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. స్క్రిప్ట్ తో పాటు ప్రస్తుతం కరోనా పేరుతో ఈ ప్రాజెక్ట్ నుండి దిల్ రాజు పూర్తిగా తప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే కనుక నిజం అయితే వినాయక్ కు తీవ్ర నిరాశ తప్పదు.
హీరోగా నటించాలని దర్శకుడిగా కూడా ప్రయత్నాలు చేయకుండా వినాయక్ ఏడాది కాలంగా అదే పనిలో ఉన్నాడు. ఇప్పుడు వినాయక్ ఏం చేస్తాడు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే సీనయ్య సినిమాను కాస్త ఆలస్యంగా అయినా ఖచ్చితంగా విడుదల చేస్తారంటూ ఇండస్ట్రీ లో కొందరు నమ్మకంగా చెబుతున్నారు.