బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా ఇక లేరు

Update: 2017-04-27 07:15 GMT
సీనియర్ బాలీవుడ్ హీరో.. రాజకీయ నాయకుడు.. యాక్టర్ వినోద్ ఖన్నా ఈరోజు ఉదయం క్యాన్సర్ కారణంగా మరణించారు. 70 ఏళ్ళ వినోద్ ఖన్నా.. గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ.. ఈ మధ్యనే ముంబయ్ లోని రిలయన్స్ ఫౌండేషన్ గ్రూపు హస్పిటల్లో చికిత్స కోసం జాయిన్ అయ్యారు. పోరాడుతూ పోరాడుతూ చివరకు క్యాన్సర్ భారిన పడిపోక తప్పలేదు.

పంజాబ్ లోని గుర్దాస్ పుర్ నియోజకవర్గం నుండి ఆయన సిట్టింగ్ బిజెపి ఏం.పి. కూడాను. 1946, అక్టోబర్ 6న జన్మించిన వినోద్ ఖన్నా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొత్తంగా నలుగురు సంతానం ఉన్నారు. ఆయన కొడుకులు రాహుల్ ఖన్నా.. తాళ్‌ మరియు రేస్ సినిమాల ఫేం అక్షయ్ ఖన్నా ఇద్దరూ కూడా నటులే. 1968లో కెరియర్ ప్రారంభించిన వినోద్ ఖన్నా.. షెక్.. అమర్ అక్బర్ ఆంటోని వంటి సినిమాల్లో నటనకు అవార్డులు కూడా పొందారు. ఈ మధ్య కాలంలో దబాంగ్ లో సల్మాన్‌ ఖాన్ తండ్రిగా.. తరువాత దిల్ వాలే సినిమాల్లోనూ కనిపించారు.

ఇక 1997లో బిజెపిలో జాయిన్ అయిన వినోద్ ఖన్నా.. 1999లో 2004లో 2014లో బిజెపి ఎంపిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. మధ్యలో కొన్నాళ్ళు టూరిజం మినిష్టర్ గా కూడా పనిచేశారు. ఏప్రియల్ 2వ తారీఖున డీహైడ్రేషన్ కారణంగా హస్పిటల్ చేయిన ఆయన.. క్యాన్సర్ కారణంగా మరణించడం దురదృష్టకరం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News