వినయ విధేయ రామ10 డేస్ కలెక్షన్స్

Update: 2019-01-21 09:07 GMT
సంక్రాంతి సీజన్లో భారీ అంచనాల నడుమ విడుదలైన రామ్ చరణ్ తాజా చిత్రం 'వినయ విధేయ రామ' మొదటి రోజు కలెక్షన్స్ బాగానే ఉన్నాయిగానీ ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది.  అప్పటి నుంచి పెద్దగా రికవర్ కాలేదు.  ఇక రెండో వీకెండ్లో ఈ సినిమా షుమారుగా నాలుగు కోట్ల రూపాయలకంటే కాస్త ఎక్కువ షేర్ మాత్రమే వసూలు చేసింది.

సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.30 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించాల్సి ఉంది కాబట్టి ఈ రేంజ్ వసూళ్ళు సరిపోవు. పది రోజులకు గాను 'వినయ విధేయ రామ' కలెక్షన్స్ దాదాపుగా రూ. 61 కోట్ల రూపాయల మార్కును టచ్ చేశాయి.  ఫుల్ రన్ లో ఈ సినిమా దాదాపుగా  63 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  రూ. 60 కోట్ల షేర్ క్లబ్ లో చేరడం గొప్పే కానీ భారీగా ప్రీ-రిలీజ్  బిజినెస్ జరగడంతో ఇంకా భారీగా డెఫిసిట్ ఉండిపోయింది.

పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 'వినయ విధేయ రామ' ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.  

నైజామ్: 12.50 cr

సీడెడ్: 11.54 cr

ఉత్తరాంధ్ర: 8.06 cr

కృష్ణ: 3.55 cr

గుంటూరు: 6.27 cr

ఈస్ట్ : 5.22 cr

వెస్ట్: 4.26 cr

నెల్లూరు: 2.76 cr

టోటల్: రూ. 54.16 cr  (ఎపీ+తెలంగాణా)

రెస్ట్ అఫ్ ఇండియా : 5.36 cr

ఓవర్సీస్: 1.43 cr

వరల్డ్ వైడ్ టోటల్ (షేర్): రూ. 60.95 cr
Tags:    

Similar News