గడసరి అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా 'జయమ్మ'
క్రాక్' సినిమాకి సంబంధించి హీరో రవితేజను గురించి ఎంతలా మాట్లాడుకున్నారో, అంతేలా ఆ సినిమాలో 'జయమ్మ' పాత్రను పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ను గురించి మాట్లాడుకున్నారు. అంతగా నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రలో ఆమె చెలరేగిపోయారు. ఆల్రెడీ ఆమె తమిళనాట లేడీ విలన్ తరహా పాత్రలలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 'తెనాలి రామకృష్ణ బిఏబీఎల్' సినిమాలోనూ ఆమె పవర్ఫుల్ విలన్ పాత్రనే పోషించారు. విలనిజంలో తనదైన స్టైల్ తో ఆమె ఆకట్టుకున్నారు. ఆ తరువాత 'క్రాక్' సినిమాతో మరిన్ని మార్కులు దక్కించుకున్నారు.
టాలీవుడ్ లో లేడీ విలన్ పాత్రలతో సాగే కథలు తక్కువ. అందువలన ఈ తరహా పాత్రలు తెలుగులో వరలక్ష్మీ శరత్ కుమార్ కి వరుసగా దక్కే అవకాశాలు ఉండకపోవచ్చు. అలా అని చెప్పేసి తెలుగులోని ఆమె అభిమానులు నిరాశ చెందవలసిన పనిలేదు. తెలుగులో పవర్ఫుల్ అత్త పాత్రలకు ఎప్పుడూ కొదవ ఉండదు. ఒకప్పుడు తెలుగు తెరపై గడసరి అత్త పాత్రలకు వాణిశ్రీ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తరువాత ఐ డోంట్ కేర్ పాలసీతో సాగే ఈ తరహా పాత్రలో 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలో రమ్యకృష్ణ దుమ్మురేపేసింది.
ఇకపై ఈ తరహా పాత్రలలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే యువ కథానాయకులకు సంబంధించిన రెండు మూడు సినిమాల్లో పవర్ఫుల్ అత్త పాత్రలు ఉన్నాయట. అమ్మాయి కొంగుకు అల్లుడిని కట్టేసి, తన ఇంటిచుట్టూ తిప్పుకోవాలనుకునే ఆ గడసరి అత్తపాత్రల కోసం, వరలక్ష్మీ శరత్ కుమార్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. తనమాటే చెల్లాలి .. తన పంతమే నెగ్గాలనే పట్టుదల కలిగిన అత్త పాత్ర సరైనది ఒకటి పడితే, ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ తిరుగుండదు. ఆ సమయం ఎంతో దూరంలో లేదనే అనిపిస్తోంది.