2020 బెస్ట్ సినిమాపై వరల్డ్ క్లాస్ చెఫ్ ప్రశంస
న్యూయార్క్ కి చెందిన వరల్డ్ క్లాస్ మాస్టర్ చెఫ్ వికాస్ ఖన్నా గురించి తెలియని వారు ఉండరు. ఆయన 2020 బెస్ట్ సినిమాల గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రస్థావించారు. `స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ`ని చూడటం తనకు చాలా ఇష్టమని ఆయన అన్నారు. స్టార్ చెఫ్ తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతను తన వృత్తి బిజీలోనూ పని మధ్య OTT ప్లాట్ ఫామ్ లపై 2020లో కొన్ని సినిమాల్ని సిరీస్ లను వీక్షించానని తెలిపారు.
హన్సాల్ మెహతా దర్శకత్వం వహించిన `స్కామ్ 1992` చిత్రాన్ని తాను పూర్తిగా ఇష్టపడ్డానని..అందులో కంటెంట్ నట ప్రదర్శనలపైనా ప్రశంసలు కురిపించారు. భారతదేశంలో రియల్ గా జరిగిన ఒక సంఘటన గురించి ఇంత అద్భుతమైన సిరీస్ చేయడం ద్వారా మెహతా భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచారని ఖన్నా అన్నారు.
“నేను రకరకాల ప్రాజెక్టుల తో బిజీగా ఉన్నా కానీ నాకు సినిమాలు చూడటానికి సమయం ఉంది. OTT వేదికపై నేను చూసినవి నన్ను నిజంగా ఆకట్టుకున్నాయి. భారతదేశం నుండి చాలా సీరియల్స్ బాగున్నాయి. ఇటీవల నేను స్కామ్ 1992 సిరీస్ ను చూశాను. ఇది చాలా తెలివైన కథనంతో ఆకట్టుకుంది. ఇది ప్రపంచ స్థాయిలో తెరకెక్కిన ఓ అద్భుత ప్రదర్శన`` అంటూ పొగిడేశారు.
ఎమ్మీ గెలుచుకున్న రిచీ మెహతా `దిల్లీ క్రైమ్` సిరీస్ గురించి కూడా మాట్లాడుతూ ఖన్నా ఇలా అన్నారు. “నేను చాలా సంవత్సరాలు హన్సల్ మెహతా కు అభిమానిని. అవార్డుకు `దిల్లీ క్రైమ్` అర్హమైనది. స్కామ్.. దిల్లీ క్రైమ్ చిత్రాల గురించి నేను చాలా గర్వపడ్డాను. హన్సాల్ - అపూర్వ అస్రానీ వంటి వారు భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తెస్తున్నారు ” అని ప్రశంసించారు.
`స్కామ్ 1992: హర్షద్ మెహతా స్టోరీ` కంటెంట్ ప్రేక్షకుల నుండి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. మౌత్ పబ్లిసిటీతో పెద్ద హిట్టయిన సిరీస్ ఇది. ప్రతీక్ గాంధీ నటన.. హన్సాల్ మెహతా దర్శకత్వ సామర్ధ్యాలపై ప్రశంసలు కురిసాయి.
ఈ సినిమాతో తనకు కథానాయకుడిగా అవకాశాలు పెరిగాయని ప్రతీక్ వెల్లడించారు. నేను హర్షద్ మెహతా పాత్ర పోషించిన తరువాత మేకర్స్ నన్ను క్లిష్టమైన పాత్రలలో చూస్తున్నారు. నేను 2021 లో మరిన్ని వెబ్ సిరీస్‌లతో బిజీ అయ్యాను. వెండితెరపైనా బిజీ కాబోతున్నాను అని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు వరల్డ్ క్లాస్ చెఫ్ ఖన్నా ప్రశంసలతో హన్సల్ మెహతా వంటి వారు మరింతగా బిజీ అయిపోవడం ఖాయం.