మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను : విజయేంద్రప్రసాద్

Update: 2022-08-12 03:55 GMT
విజయేంద్రప్రసాద్ కి రచయితగా సుదీర్ఘమైన అనుభవం ఉంది. అన్ని ప్రాంతాలవారినీ.. అన్ని భాషల వారిని ఆకట్టుకోవడానికి ఎలాంటి కథలను రెడీ చేయాలనేది ఆయనకి బాగా తెలుసు. టాలీవుడ్  నుంచి బాలీవుడ్ వరకూ ఆయన కథల కోసం వెయిట్ చేసేవారు ఎక్కువమందినే ఉంటారు. చాలా కాలంగా కథలపై కసరత్తు చేస్తూ రావడం వలన, ఏ కథకు ఆడియన్స్ పట్టకడతారనే విషయంలో ఆయనకి మంచి అనుభవం ఉంది.

అలాంటి విజయేంద్రప్రసాద్ నిన్న రాత్రి జరిగిన 'కార్తికేయ 2' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాట్లాడుతూ.. "ఈ ఫంక్షన్ కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.

సాధారణంగా ఏదైనా సినిమా ఫంక్షన్ కి వెళ్లవలసి వచ్చినప్పుడు మనసుకు కాస్త అసహనంగా ఉంటుంది. కొన్ని సినిమాలు ఆడవనే విషయం ముఖాన్నే తెలిసిపోతుంటుంది. మొహమాటానికి వెల్లవలసి వస్తుంది.. బాగా ఆడుతుందని చెప్పవలసి వస్తుంది. చెప్పక తప్పదు మరి.

కానీ ఈ సినిమాకి ఆ అవసరం లేదు. మనసారా.. వాచా.. కర్మణా చాలా చాలా బాగుంది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నాకు అనిపిస్తోంది. నిర్మాతకు చెబుతున్నాను.. రాసి పెట్టుకోండి.

తెలుగులో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో.. హిందీలో కూడా అంతే వసూలు చేస్తోంది. సౌత్ సినిమా విజయపరంపర హిందీలోను కంటిన్యూ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూశాను.. చాలా చాలా అద్భుతంగా ఉంది. అనుపమ పరమేశ్వరన్ తన పాత్రను చాలా గొప్పగా చేసింది.
Read more!

నిఖిల్ విషయానికి వస్తే 'కార్తికేయ' కి మించిన కష్టం ఈ సినిమా కోసం పడ్డాడు. కాలభైరవ గురించి ఏం చెప్పను?! నాన్న పేరును నిలబెట్టాడు. ముఖ్యంగా చందూ మొండేటిది మా ఊరేనని ఈ రోజునే తెలిసింది. గోదావరి నీళ్లు తాగేసి పెరిగిన తరువాత టాలెంట్ లేకుండా ఎలా ఉంటుంది? ఆర్టిస్టులందరికీ.. టెక్నీషియన్లకు ఆల్ ది బెస్ట్  చెబుతున్నాను. ఈ నెల  13వ తేదీన ఈ సినిమాను  థియేటర్ లలో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు" అంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News