• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గాయ‌నిపై అలా పంచ్ వేసిన...

గాయ‌నిపై అలా పంచ్ వేసిన స్టార్ హీరో

By - Tupaki Desk
Update: 2020-05-22 06:45 GMT
స్టార్లు ప‌బ్లిక్ వేదిక‌ల‌పై మాట్లాడేప్పుడు చాలా జాగ్ర‌త్త వ‌హించాల్సి ఉంటుంది. అలాంటి చోట మాట ఏమాత్రం తేడా వ‌చ్చినా అభిమానుల ర‌చ్చ‌ ఎలా ఉంటుందో ఊహించ‌న‌ల‌వి కాదు. అయితే ఆ హాట్ సింగ‌ర్ కోలీవుడ్ స్టార్ హీరోపై నోరు జారి బుక్క‌య్యింది. ఆవిడ అన్న మాట‌కు రివ‌ర్స్ పంచ్ ఇచ్చాడు ఆ స్టార్ హీరో. ఇంత‌కీ ఈ వ్య‌వ‌హారంలో గాయ‌ని ఎవ‌రు?  స్టార్ హీరో ఎవ‌రు? అంటే.. గాయ‌ని ఆండ్రియా జెరోమియా.. స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్.

ద‌ళ‌ప‌తి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన `మాస్టర్` త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్ర‌తినాయ‌కుడి పాత్రలో నటిస్తున్నారు. అత‌డితో జత కట్టే నాయిక‌గా ఆండ్రియా న‌టించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు.. ద‌ళ‌పతి విజయ్ కు మధ్య జరిగిన ఒక ఉల్లాస సంఘటనను గుర్తు చేసుకుంది ఆండ్రియా.

విజ‌య్ పెద్ద స్టార్ మాత్ర‌మే కాదు.. మంచి గాయ‌కుడు కూడా. గత సంవత్సరం `బిగిల్` కోసం చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ ని పాడారు ఆయ‌న‌. `వెరితం....` అంటూ సాగే ఈ పాట‌ను యూట్యూబ్ లో 81 ల‌క్షల మంది వీక్షించారు. విజ‌య్ పాడిన ఈ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా అత‌డికి ఉన్న‌ విశ్వసనీయ అభిమానం ఎలాంటిదో క‌ళ్ల‌కు గ‌ట్టింది.

అయితే ఆ పాట‌ను విజయ్ పాడార‌ని ఆండ్రియాకు తెలియదట. అంతేనా విజ‌య్ త‌న‌కు తానుగానే ఆ పాట‌ను నేను పాడాను అని చెబితే తెలుసుకుని షాక్ కి గుర‌య్యింద‌ట‌. తనకు ఇవన్నీ తెలియదని ఆమె విజయ్ ముందే అంగీకరించింది. దానికి బదులుగా విజయ్ నవ్వుతూ `నిజంగా తమిళనాడులో నివసిస్తున్నావా?` అంటూ ఆండ్రియాపై పంచ్ వేసేశాడు. ఇక మాస్టర్ చిత్రంలో పని చేసిన తర్వాత తాను ఇప్పుడు విజయ్ కి పెద్ద అభిమాని అయ్యానని ఆ ఇంట‌ర్వ్యూలో ఆండ్రియా వెల్లడించింది.

మాస్ట‌ర్ చిత్రం ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. సంక్షోభం వ‌ల్ల వాయిదా ప‌డింది. ఓటీటీ రిలీజ్ కోసం స‌న్నాహాలు చేస్తున్నార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే అధికారికంగా దానికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.
Tags:    
  • Vijay 
  • Andrea Jeremiah 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

Copyright @2026

Powered by Blink CMS