రౌడీగారు లుక్ మార్చారహో..!

Update: 2019-09-14 04:51 GMT
యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తరచుగా లుక్స్  మారుస్తూ ఉంటాడు. ఒకసారి ఫుల్ గడ్డంలో కనిపిస్తే మరో సారి క్లీన్ షేవ్ లుక్ లో ఉంటాడు.  మరోసారి లాంగ్ హెయిర్ తో ఉంటాడు.  కానీ గత కొంత కాలంగా మాత్రం గుబురు గడ్డం లుక్ లోనే కనిపిస్తున్నాడు. 'డియర్ కామ్రేడ్' ప్రమోషన్స్ సమయంలో.. రీసెంట్ గా ఫిలింఫేర్ అవార్డుల ఈవెంట్లో విజయ్ గడ్డంతోనే కనిపించాడు.  

అయితే తాజాగా ఆ లుక్ మారిపోయింది.  రౌడీగారు తన లుక్ ను ఫుల్ గా మార్చాడు.  హెయిర్ కొంచం పొడవుగానే ఉంది.. గడ్డం మాత్రం మాయం.  విజయ్ రీసెంట్ గా ఒక అభిమానితో ఫోటో దిగడంతో ఈ లుక్ బయటకు వచ్చింది.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా రోజుల తర్వాత రౌడీగారిని ఇలా చూడడం చాలా ఫ్రెష్ గా ఉంది. విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ సినిమాలో కొన్ని కొత్త ఎపిసోడ్ కోసమే ఈ లుక్ చేంజ్ అయి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

క్రాంతి మాధవ్ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ మరో సినిమాను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. పూరి అంటేనే హీరోలకు మేకోవర్ ఇస్తారని పేరు. మరి రౌడీగారి కోసం ఎలాంటి గెటప్ ప్లాన్ చేశారో ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News