• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీనియర్ భామ‌తో విజయ్...

సీనియర్ భామ‌తో విజయ్ దేవ‌ర‌కొండ‌

By - Tupaki Desk
Update: 2018-07-16 06:26 GMT
ప‌న్నెండేళ్లుగా తెలుగు తెర‌పై సంద‌డి చేస్తున్న క‌థానాయిక కాజ‌ల్‌. ఆమెతో పోలిస్తే విజ‌య్ దేవ‌ర‌కొండ చాలా జూనియ‌ర్‌. కానీ ఈ ఇద్ద‌రూ క‌లిసి త్వ‌రలోనే జోడీ కట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం.  ఓన‌మాలు - మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల‌తో మంచి ద‌ర్శ‌కుడు అనిపించుకొన్న క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్‌ - కాజ‌ల్ జంట క‌లిసి  న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. క‌థ‌ల ఎంపిక‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి మంచి టేస్ట్ ఉంద‌నే విష‌యం పెళ్లిచూపులు - అర్జున్‌ రెడ్డి వంటి చిత్రాల‌తో రుజువైంది. త‌దుప‌రి ఆయ‌న గీత గోవిందం - టాక్సీవాలా చిత్రాల‌తో సంద‌డి చేయ‌బోతున్నాడు. ఆల్మోస్ట్ ఈ సినిమాల షూటింగ్ కూడా పూర్త‌యింది.

ఇక తదుప‌రి విజ‌య్ న‌టించే చిత్రం క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలోనే అని తెలుస్తోంది. క్రాంతి మాధ‌వ్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో నాయ‌కానాయిక‌లిద్ద‌రూ వెంట‌నే ఓకే చేశార‌ట‌. ఈ సినిమాలో కాజ‌ల్‌ని ఎంపిక చేసుకోవ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణం కూడా ఉన్న‌ట్టు తెలిసింది. మ‌రి అదెందుకనేది సినిమా ఆరంభ‌మ‌య్యాకే తెలిసే  అవ‌కాశం ఉంది. కానీ ఈ కాంబో మాత్రం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.  క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్టు స‌మాచారం. క్రాంతిమాధ‌వ్ ఇదివ‌ర‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు తీసింది కూడా ఈ సంస్థ‌లోనే.
Tags:    
  • Vijay Devarakonda 
  • Kajal Agarwal 
  • Telugu News 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS