ఓవ‌ర్‌ నైట్ స్టార్‌ డ‌మ్ అబ‌ద్ధం!?

Update: 2018-11-16 04:23 GMT
ఓవ‌ర్‌ నైట్‌ లో స్టార్‌ డ‌మ్ చేతికి చిక్కింది క‌దా.. దీనిని మీరు ఎలా ఆస్వాధిస్తున్నారు? అని అడిగేస్తుంటారు అమాయ‌కంగా. అస‌లు ఓవ‌ర్‌ నైట్ స్టార్ డ‌మ్ అంటే ఏంటో?  పైగా రంగుల ప్ర‌పంచంలో చుక్క‌లు చూపించ‌కుండా ఓవ‌ర్‌ నైట్ స్టార్ డ‌మ్ ఎవ‌రిస్తారు? అన్న‌ది పాయింట్. ఇక్క‌డెవ‌రూ ఓవ‌ర్‌ నైట్‌ లో స్టార్లు అయిపోరు. దానికి ముందు చాలానే ప్రిప‌రేష‌న్ ఉంటుంది. చాలా మందికి ఎన్నారై బ్యాక్‌ డ్రాప్ ఉండొచ్చు. ఆర్థికంగా స్థిర‌ప‌డి ఆ త‌ర్వాతే ప్ర‌యోగాలు చేసేవాళ్లు ఎక్కువ‌. డాక్ట‌ర్లు - యాక్ట‌ర్ల బ్యాక్‌ గ్రౌండ్ ఉన్న‌వాళ్లు ఆర్టిస్టులుగా ఎక్కువ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.  జీవితాంతం ఖ‌ర్చు పెట్టుకునేంత సంపాదించాక .. ఉన్న జీవితం ఒక్క‌టే క‌దా.. క‌నీసం బ్యాలెన్స్ లైఫ్ అయినా క‌ల‌ర్‌ ఫుల్ గా లీడ్ చేస్తే త‌ప్పేం లేదులే అని వ‌చ్చేవాళ్లే సినీప‌రిశ్ర‌మ‌లో ఎక్కువ ఉంటారు. అయితే అది తెలియ‌క ప‌ల్లెటూరి నుంచి కొబ్బ‌రి నూనె బ్యాచ్‌ లు కృష్ణాన‌గ‌ర్ - ఫిలింన‌గ‌ర్‌ లో దిగిపోయి స‌రిగా తిండి లేక‌ - ఇంటి ద‌గ్గ‌ర చెప్పుకోలేక నానా తంటాలు ప‌డుతుంటారు. ఏళ్ల‌కు ఏళ్లు కాల‌గ‌ర్భంలో గ‌డిచిపోతాయి. కొంద‌రైతే ఇక్క‌డే హ‌న‌నం అయిపోతుంటారు.

ఎంత క‌ష్ట‌ప‌డినా దేవ‌ర‌కొండ లాగో - నానీ లానో లేక నిఖిల్ లానో త‌మ‌ను ఓవ‌ర్‌ నైట్ స్టార్ డ‌మ్ వెతుక్కుంటూ రాలేద‌ని బాధ‌ప‌డిపోయేవాళ్లు ఉంటారు. ఇదే ప్ర‌శ్న కాస్త అటూ ఇటూగా దేవ‌ర‌కొండ‌ను అడిగేస్తే .. ఒక్క‌సారిగా అవాక్క‌య్యాడు. ఓవ‌ర్‌ నైట్ స్టార్‌ డ‌మ్‌ నా.. అలా అనేశారేంటి భ‌య్యా.. ఆరేళ్లు ప‌ట్టింది స్టార్‌ అనే ప‌దం విన‌డానికి. ఇక్క‌డ మా క‌ష్టాలు ఎవ‌రికి తెలుసు?  పెళ్లి చూపులు ముందు చాలానే స్ట్రగుల్ అనుభ‌వించాం. `ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` ముందు చాలానే క‌థ ఉంది. `పెళ్లి చూపులు` టైమ్‌ లో అయితే అస‌లు సినిమా క‌ష్టాలే. త‌రుణ్ భాస్క‌ర్ - నేను చాలానే తంటాలు పడ్డాం. అవేవీ ఎవ‌రికీ తెలియ‌వు. బ‌య‌ట‌కు క‌నిపించే స్టార్ డ‌మ్ ఒక్క‌టే క‌నిపిస్తుంది.. అని అన్నాడు.

నా సినిమాకి ప‌ని చేసిన సాంకేతిక నిపుణుల క‌ష్టం ప్ర‌త్య‌క్షంగా చూశాను. సంగీత ద‌ర్శ‌కుడు జేక్ ప‌నిలో ఉండ‌గా ఓ షాకింగ్ నిజం తెలిసింది. జేక్ డాడ్‌ కి క్యాన్స‌ర్. ఓవైపు కీమో థెర‌పీ చేస్తుంటే క‌న్న బిడ్డ‌ కి ఆ నాన్న ఏమ‌ని చెప్పాడో తెలుసా?  సినిమానే నీ జీవితం.. స‌క్సెస్ ముఖ్యం .. వెళ్లు.. ఆ ప‌నిలో ఉండు..! అని ధీవించి పంపాడ‌ట‌. ఆ మాట దేవ‌ర‌కొండ చెబుతుంటే మీడియాకే క‌డుపు త‌రుక్కుపోయింది. ఆ సిట్యుయేష‌న్‌ లో నాన్న‌ను వ‌దులుకుని రీరికార్డింగ్ ప‌నులు జేక్ పూర్తి చేశాడ‌ట‌. నేనైతే యాక్టింగ్ వ‌దిలి వెళ్లిపోయేవాడిని ఆ స‌న్నివేశంలో ఉంటే.. అనీ అన్నాడు దేవ‌ర‌కొండ‌. నానీ లాగా - నిఖిల్‌ లాగా అదృష్టం క‌లిసి రావాలంటే అంతే గ్రేట్ ఫీచర్స్ మ‌న‌లో ఉండాలి క‌దా ముందు.. దేవ‌ర‌కొండ అంత వైబ్రేంట్‌ గా వేదిక‌ల‌పై మాట్లాడే ద‌మ్ముందా.. ఆక‌ట్టుకునే చ‌తుర‌త‌ - గ‌ట్స్ క‌ల‌లుగ‌నే వాళ్ల‌కు ఉండాలి క‌దా?  అస‌లు ఇదంతా క‌ల‌.. న‌న్ను నేనే న‌మ్మ‌లేను! ఈ స్టార్ డ‌మ్ ఇంకెన్నాళ్లు.. నేను నాలానే ఉంటాను..  అని నిజాయితీగా మాట్లాడే హుందాత‌నం ఎంద‌రికి ఉంటుంది దేవ‌ర‌కొండ‌లాగా..!
Tags:    

Similar News