• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో ఆఫర్‌ ప్రకటించిన...

మరో ఆఫర్‌ ప్రకటించిన దేవరకొండ..!

By - Tupaki Desk
Update: 2018-11-19 10:08 GMT
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. రాజకీయ నాయకులు తమకు ఓటు వేస్తే అది ఫ్రీ, ఇది ఫ్రీ అంటూ ప్రచారాలు చేస్తున్నారు. వారిని చూసి ఇన్సిఫైర్‌ అయ్యాడో లేక మరేంటో కాని విజయ్‌ దేవరకొండ ఉచిత స్నాక్స్‌ ఆఫర్‌ ప్రకటించాడు. తాజాగా విజయ్‌ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఊహించని విధంగా ట్యాక్సీవాలా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రోజే ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకుంది. ఇకపై వచ్చేవన్నీ నిర్మాతలకు లాభాలే. దాంతో విజయ్‌ దేవరకొండ ప్రేక్షకులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాడు.

ట్యాక్సీవాలా సినిమా సక్సెస్‌ వేడుక సందర్బంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. మళ్లీ మిమ్మల్ని థియేటర్‌ లో కలిసేందుకు చాలా సమయం పట్టనుంది. తదుపరి చిత్రం విడుదలకు చాలా సమయం ఉంది. అందుకే ఇప్పుడే ఫుల్‌ ఎంజాయ్‌ చేయండి. మరోసారి గట్టిగా కొట్టాం. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకే మీరు కూడా హ్యాపీగా ఉండాలని ఒక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ మా తరపున ఇస్తున్నాం. ఇంటర్వెల్‌ లో స్నాక్స్‌ ఎంత కావాలంటే అంత, ఎన్ని కావాలంటే అన్ని తినేయండి. బిల్లు మేం కడతాం అంటూ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాడు.

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయ్‌ దేవరకొండ ప్లాన్స్‌ అదిరిపోతాయి. సినిమాకు చాలా విభిన్నంగా పబ్లిసిటీ చేయడంలో విజయ్‌ దేవరకొండ ముందుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్‌ దేవరకొండ ట్యాక్సీవాలా విడుదల రోజు స్వయంగా ట్యాక్సీవాలా అయ్యి ఎంతో మందిని గమ్యస్థానాలకు చేర్చుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఈ స్నాక్స్‌ ఫ్రీతో సినిమాకు మరింతగా భారీ పబ్లిసిటీ దక్కడం ఖాయం అంటున్నారు.
Tags:    
  • Vijay Devarakonda 
  • Audience 
  • Theatre Visit 

Similar News

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!

2026-11-12 08:17 GMT

సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!

2026-11-12 08:16 GMT

వారి గురించి ఆలోచించడం సోనూ సూద్‌ గొప్పతనం..!

2026-11-12 08:16 GMT

'ఇడుపు కాయితం' టీజర్.. సీతా కళ్యాణంతో మొదలై విడాకుల దాకా..

2026-11-12 06:57 GMT

శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తప్పిన పెద్ద ముప్పు!

2026-11-12 06:51 GMT

2024-26 మధ్య తెలుగులో వచ్చిన బెస్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇవేనా...

2026-11-12 06:06 GMT

టికెట్ రేట్లు పెరిగినా ప్రేక్షకులను రప్పించిన సినిమాలు.. పుష్ప 2 రికార్డు ప్రత్యేకం!

2026-11-12 05:55 GMT

అనిరుధ్ పెళ్లి వీడియోలపై వార్నింగ్.. ప్రైవసీకి భంగం కలిగిస్తే చర్యలు తప్పవా?

2026-11-12 05:55 GMT

టాక్సిక్ ఫ్లాప్‌పై కియారా కామెంట్స్.. కన్నడ ఇండస్ట్రీని తప్పుబట్టని హీరోయిన్!

2026-11-12 05:53 GMT

ఒకే ప్రేమ్ లో ర‌ణ‌వీర్..ర‌ణ‌బీర్..దీపిక‌..అలియా!

2026-11-12 05:50 GMT

పవన్ పిల్లలకు ఆ ఆస్తి.. ఎప్పుడిచ్చారంటే!

2026-11-12 04:22 GMT

Copyright @2026

Powered by Blink CMS