ఇప్పటికి కుర్రాడితోనే అశ్వినీదత్

Update: 2016-10-21 15:37 GMT
మెగాస్టార్ చిరంజీవితో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ సినిమా స్టార్ట్ అనౌన్స్ చేస్తారనే న్యూస్ గత కొన్ని రోజూలుగా సర్య్యులేట్ అవుతోంది. అది మెగా 151 అని.. 152 అని.. రకరకాల టాక్స్ ఉన్నాయి.

అయితే వీటిలో ఏదీ ఇంకా అధికారికం కాదు.. కనీసం ఇప్పట్లో అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ కూడా లేదని అంటున్నారు. కానీ ఈ నిర్మాత.. ఓ సినిమా తీసేందుకు రెడీ అయిపోతున్నాడు. పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండతో అశ్వనీదత్ సినిమా ఖాయమైందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే స్టోరీ సిట్టింగ్స్ తో అన్నీ పూర్తయిపోగా.. ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ మాత్రమే పెండింగ్ ఉంది.

కథ విని ఎగ్జైట్ అయిన అశ్వినీదత్.. తనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. డిసెంబర్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్ుతతం అదుగో చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న రవిబాబు.. దాని పనులను ఫినిషింగ్ దశకు తీసుకు వచ్చేశాడు. పూర్తిగా కొత్త వాళ్లతో తెరకెక్కనున్న అదుగో.. 2017 ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.
Tags:    

Similar News