• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ మూవీలో అర్జున్...

మెగాస్టార్ మూవీలో అర్జున్ రెడ్డి.. మెరవనున్నాడా..?

By - Tupaki Desk
Update: 2020-07-06 11:50 GMT
మలయాళ స్టార్ హీరో మోహ‌న్‌లాల్ ప్రధాన పాత్రలో న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘లూసిఫ‌ర్’. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ కానుంది. ఇప్పటికే ‘సాహో’ డైరెక్ట‌ర్ సుజీత్‌ ఈ సినిమా బాధ్య‌త‌లను స్వీకరించి స్క్రిప్ట్ పనులలో ఉన్నాడట. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. లూసిఫర్ తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యిందట. పృథ్వీరాజ్ సుకుమార‌న్ డైరెక్ట్ చేసిన ఒరిజిన‌ల్ ‘లూసిఫ‌ర్’ రీమేక్ హ‌క్కుల్ని రామ్‌చ‌ర‌ణ్ దక్కించుకున్నాడు. ఆయనే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడు. నిజానికి లూసిఫర్ మలయాళం మూవీ తెలుగులో డబ్ అయి విడుద‌లైంది. కానీ ప్రేక్ష‌కుల ఆదరణ నోచుకోలేక పోయింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌ధాన పాత్ర‌ను మోహ‌న్‌లాల్ పోషించిన పాత్ర విధానం, బ్రిలియంట్ డైరెక్షన్ విధానం క్రిటిక్స్‌ను బాగా మెప్పించాయి. మ‌ల‌యాళంలో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది ‘లూసిఫ‌ర్‌’.

మోహ‌న్‌ లాల్ పోషించిన పాత్ర చిరంజీవికి తెగ న‌చ్చేసి ఆ పాత్ర‌ను పోషించాల‌ని సిద్ధం అయ్యారట. అయితే ఒరిజినల్ లూసిఫర్ లో నటి మంజు వారియర్ పాత్ర కూడా కీలకమైనదే. అయితే తెలుగు వర్షన్ కోసం ఆ పాత్రలో సుహాసిని మణిరత్నం నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఇందులో చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆ పాత్ర కోసం చిత్రయూనిట్ యంగ్ హీరో విజయ్ దేవరకొండను సంప్రదించినట్లుగా టాక్ నడుస్తుంది. అలాగే జగపతిబాబు పేరు కూడా వినిపిస్తుంది. ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక తెలుగు సినీ ప్రేక్షకులు.. మెగాస్టార్ అభిమానులు సైతం ‘లూసిఫ‌ర్’ రీమేక్‌లో చిరంజీవిని చూడాల‌ని కుతూహ‌లం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా డైరెక్ట‌ర్ సుజీత్ రీమేక్ స్క్రిప్ట్ వ‌ర్క్ కంప్లీట్ చేశాడ‌ని.. హీరో ఎలివేషన్స్ అదిరిపోతాయని సమాచారం. చూడాలి మరి ఎలా ఉండబోతుందో..!
Tags:    
  • Chiranjeevi 
  • Lucifer Remake 
  • Vijay devarakonda 

Similar News

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS