ఫస్టు లుక్ః ఏ మంత్రం వేశావే!!

Update: 2017-10-20 04:02 GMT
ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయాలంటే ఈ రోజుల్లో సినిమాల్లో టాప్ హీరోలే ఉండవల్సిన అవసరం లేదు. టాలెంట్ ఉన్న నటులు అలాగే మంచి కాన్సెప్ట్ తో కూడిన కథ ఉంటే చాలు బాక్స్ ఆఫీస్ హిట్టు పడటం ఖాయం. ఈ రోజుల్లో కుర్ర హీరోలు ఎక్కువగా ప్రయోగాత్మకమైన సినిమాలనే తెరకెక్కిస్తున్నారు. అలా అయితేనే సినిమా తేడా వచ్చినా మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చని ప్రయత్నాలు చేస్తున్నారు.

అలా ఉంటేనే మంచి హిట్స్ అందుకోవచ్చని నిరూపించిన హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఎవరు ఊహించని విధమైన హిట్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత సినిమా ఎలా తీస్తాడా అని అందరిలోను కొంత ఆసక్తి నెలకొంది. అయితే విజయ్ ఆ తర్వాత సినిమాలు కూడా చాలా కొత్తగా ఉండబోతున్నాయని చెబుతున్నాడు. రీసెంట్ గా మరోకొత్త మూవీ పోస్టర్ ని రిలీజ్ చేశాడు విజయ్. కొత్త కుర్రాడు శ్రీధర్ మర్రి దర్శకత్వంలో ఏ మంత్రం వేసావే అనే సినిమా లుక్ చాలా కొత్తగా ఉంది.

అర్జున్ రెడ్డి సినిమాలో యాంగ్రీ బాయ్ గా కనిపించిన విజయ్ ఈ సినిమాలో మాత్రం చాలా కూల్ గా ఉంటాడా? అనేలా పోస్టర్ లో కనిపిస్తున్నాడు. దీనంగా ప్రేయసి కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోందిలే. ఇక ఈ సినిమాతో పాటు విజయ్ సాయి దేవరకొండ - పరశురామ్ కాంబినేషల్ లో ఒక సినిమాను చేస్తున్నాడు. గీత ఆర్ట్స్-యువీ క్రియేషన్స్ ఆ సినిమాను నిర్మిస్తోంది.  
Tags:    

Similar News