అమ్మకు లైఫ్‌ లాంగ్‌ హామీ ఇచ్చిన రౌడీ స్టార్‌

Update: 2020-09-25 03:45 GMT
టాలీవుడ్‌ రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ తన తల్లికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడనే విషయం తెల్సిందే. అమ్మకు సంబంధించిన ఫొటోలు అమ్మతో ఉన్న ఫొటోలను విజయ్‌ రెగ్యులర్‌ గా షేర్‌ చేస్తూ అమ్మపై ఉన్న ప్రేమను చూపిస్తూ ఉంటాడు. అమ్మా నాన్నలపై దేవరకొండ బ్రదర్స్‌ చూపించే ప్రేమాభిమానాలు వారిని సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యే అందరికి తెల్సిందే. తాజాగా దేవరకొండ బ్రదర్స్‌ మదర్‌ అయిన మాధవి గారి పుట్టిన రోజు. ఈ సందర్బంగా సన్నిహితులను పిలిచి విజయ్‌ దేరకొండ చిన్న పార్టీ ఏర్పాటు చేశాడు. కుటుంబ సభ్యులతో పాటు రష్మిక మందన్నా కూడా బర్త్‌ డే పార్టీలో పాల్గొంది. కలర్‌ ఫుల్‌ బర్త్‌ డే పార్టీ నిర్వహించిన విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేశాడు.

అమ్మ మాధవి బ్యాట్‌ పట్టుకుని ఉండగా ఆమెకు ఇరు వైపుల దేవరకొండ బ్రదర్స్‌ నిల్చున్నారు. ముగ్గరు కలిసి బ్యాటింగ్‌ చేసినట్లుగా ఫోజ్‌ ఇచ్చిన సరదా వీడియోను విజయ్‌ దేరకొండ షేర్‌ చేశారు. ఆ వీడియోకు నేను నిన్ను జీవితాంతం సంతోషంగా ఉంచుతానమ్మ. హ్యాపీ బర్త్‌ డే అమ్మ అంటూ విజయ్‌ కామెంట్‌ పెట్టాడు. విజయ్‌ కి అమ్మ మీద ఉన్న ప్రేమకు ఈ పోస్ట్‌ సాక్ష్యంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక మద్య తరగతి కుటుంబంకు చెందిన విజయ్‌ దేవరకొండ చిన్న తనంలో తన తల్లిదండ్రులు పడ్డ ఇబ్బందులను చూశారు. అందుకే ఆయన ఇప్పుడు వారిని ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలని జీవితాంతం సంతోషంగా ఉండాలని బలంగా కోరుకుంటున్నాడు.
Tags:    

Similar News