అక్కడ కూడా బిచ్చగాడ్ని నేనే..

Update: 2016-10-14 13:30 GMT
''బిచ్చగాడు'' సినిమాను మొన్న టివిల్లో వేస్తే.. టిఆర్ పి లు కూడా కంగారుపడే రేంజ్ టి.ఆర్.పి.లు వచ్చాయి. ఆ సినిమాలో ఉన్న కంటెంట్ దమ్ము అదే. ధియేటర్లలో డబ్బింగ్ వర్షన్ అసలు ఏమాత్రం పబ్లిసిటీయే లేకుండా రిలీజైన ఈ సినిమా.. హీరో అండ్ కంపోజర్ విజయ్ ఆంటోనీ కెరియర్లోనే పెద్ద హిట్టుగా నిలిచింది. అయితే ఈ బిచ్చగాడు ఇప్పుడు అదే ఊపుతో వేరే బాషల్లోకి వెళుతున్నాడు.

నిజానికి హిందీలో ఈ బిచ్చగాడు సినిమా ఏ హీరో చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు వచ్చేలోపే.. అసలు హిందీ వర్షెన్ ను దర్శకుడు శశి కాకుండా.. స్వయంగా విజయ్ ఆంటోనీ డైరక్ట్ చేస్తాడనే టాక్ వచ్చింది. అయితే ఇదంతా జస్ట్ ట్రాష్‌ అంటున్నాడు బిచ్చగాడు హీరో. అవునండీ.. హిందీలో కూడా ఈ సినిమాను శశి డైరక్ట్ చేస్తాడట. అంతేకాదు.. ఈ సినిమా హిందీ వర్షెన్లో కూడా హీరోగా విజయ్ ఆంటోనీయే నటిస్తాడట. అంటే అక్కడ కూడా ఆడియన్స్ కు షాకివ్వడానికి తానే రెడీ అంటున్నాడు. మొత్తానికి మనోడి గట్స్ కు హ్యాట్సాఫ్‌ చెప్పాలి.

ఇకపోతే బిచ్చగాడు సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఇప్పుడు విజయ్ ఆంటోనీ తదుపరి సినిమా ''బేతాళుడు'' తెలుగులో కూడా భారీగా మార్కెటింగ్ అయిపోతోంది. ఈ సినిమాతో కూడా ప్రూవ్ చేసుకుంటే మనోడు సూర్య టైపులో తెలుగులో కూడా భారీగా మార్కెట్ ఓపెన్ చేసుకున్నట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News