మంచు విష్ణు 'మోసగాళ్లు' చిత్రానికి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్...!
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''మోసగాళ్లు''. ప్రపంచంలో అతి పెద్దదైన ఐటీ స్కామ్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో విష్ణు సోదరి పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మంచు విష్ణు ఈ చిత్రాన్ని మునుపెన్నడూ లేని విధంగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే 'మోసగాళ్లు' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో సీనియర్ హీరో వెంకటేష్ రిలీజ్ చేసిన టైటిల్ కీ థీమ్ మ్యూజిక్.. అల్లు అర్జున్ విడుదల చేసిన టీజర్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'మోసగాళ్లు' టీమ్ ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది.
'మోసగాళ్లు' చిత్రానికి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఈ సినిమా స్టోరీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెంకీ వివరిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఒక స్టార్ హీరోతో వాయిస్ ఓవర్ ఇప్పిస్తే బాగుంటుందని భావించి వెంకటేష్ ని సంప్రదించగా వెంటనే ఒప్పుకున్నాడని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న 'మోసగాళ్లు' కు వెంకటేష్ వాయిస్ ఓవర్ కచ్చితంగా పెద్ద ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. తెలుగు - ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ని భారీ బడ్జెట్ తో అత్యున్నతమైన సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో కూడా విడుదల కానుంది. బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రుహీ సింగ్ - నవదీప్ - నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.