తాజా సినిమాతో అతడి రెమ్యునరేషన్ రూ.20కోట్లకు చేరింది

Update: 2021-10-20 00:30 GMT
బాలీవుడ్ లో మహా అయితే పదిహేనను సినిమాలు చేసి ఉంటాడేమో. హీరోగా ఎంట్రీ ఇద్దామని వెళితే ఛీ కొట్టారు. వేల కొద్దీ ఆడిషన్లకు వెళ్లినా ఉపయోగం లేకపోవటంతో చివరకు ఒక డైరెక్టర్ దగ్గర నెలకు రూ.4500 జీతంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అలా వచ్చిన పరిచయంతో చిన్న పాత్ర చేసిన అతడికి లభించిన పారితోషికం రూ.10వేలు. అలా ఎన్నో ఛీత్కారాలు.. అవమానాల్ని భరించి తన సత్తా చాటే క్రమంలో తాజాగా అతడు నటించిన సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావటం.. అది హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అతడి రెమ్యునరేషన్ ను రూ.20కోట్లకు తీసుకెళ్లింది. ఇప్పటికే అతని పేరు మీకు అర్థమై ఉంటుంది. అవును.. అతడే విక్కీ కౌశల్.

గ్యాంగ్ ఆఫ్ వసీపూర్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి.. బాంబే వెల్వెట్ మూవీలో కాసింత సేపు కనిపించిన అతడికి తొలి బ్రేక్.. ‘మసాన్’తో మొదలైంది. ఆ తర్వాత అతను చేసిన సినిమాలు అతడి పేరును అంతకంతకూ పెంచినవే. ఉరి: ది సర్జికల్ స్ట్రయిక్స్ తో అతను ఒక్కసారిగా ఫేమస్ కావటమే కాదు.. జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా అతను నటించిన ‘సర్దార్ ఉదమ్’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావటం.. పాజిటివ్ టాక్ ను తీసుకొచ్చింది.
Read more!

అతడి ఇమేజ్ ను భారీగా పెంచేసింది. సర్దార్ ఉదమ్ వరకు నాలుగైదు కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ తీసుకునే విక్కీ కౌశల్ తాజా మూవీ తర్వాత అతడికి రూ.20 కోట్లు ఇచ్చేందుకు సైతం ఓకే చెబుతున్నారట. ఒకప్పుడు తనకు సినిమా అవకాశాలు ఇవ్వమని అడిగిన డైరెక్టర్ల చేత ఛీ కొట్టిన వారే.. ఇప్పుడు సినిమా ఆఫర్లు ఇవ్వటమే కాదు.. భారీ పారితోషికం ఇస్తామని చెబుతున్నారట. సినిమాల పరంగా అంతకంతకూ చెలరేగిపోతున్న విక్కీ కౌశల్.. మరోవైప బాలీవుడ్ అందాల బొమ్మ కత్రినా కైఫ్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లుగా తరచూ వార్తల్లో కనిపిస్తున్నాడు.

తాజాగా ఒక పార్టీలో కత్రినాతో టైట్ హగ్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారటం తెలిసిందే. ఇలా సినిమాలతోనూ.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలతో నిత్యం వార్తల్లో కనిపిస్తున్న విక్కీ కౌశల్ కు తాజాగా ఏటు చూసినా తిరుగు లేదని చెప్పాలి. చివరగా.. ఈ మధ్యన అతడు రష్మికతో చేసిన అండర్ వేర్ యాడ్ విమర్శలతో పాటు ట్రోలింగ్ లు ఎదుర్కొన్నా.. అలానూ హాట్ టాపిక్ గానే మారటం గమనార్హం.
Tags:    

Similar News