#DRUGS 2019 పార్టీపై ప్ర‌శ్నిస్తే యంగ్ హీరో స్కిప్ కొట్టాడంటూ..!

Update: 2020-09-25 06:45 GMT
బాలీవుడ్ లో మాదకద్రవ్యాల లింకుల‌‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అణిచివేత పెరిగేకొద్దీ అనేకమంది ఎ-లిస్టర్స్ బ‌య‌ట ప‌డుతున్నారు. ఇటీవల కరణ్ జోహార్ నివాసంలో గత ఏడాది పార్టీలో పాల్గొన్నవారి జాబితాను ఎన్.సి.బి ప‌రిశీలించి స‌మ‌న్లు పంపుతున్న వైనం తెలిసిన‌దే. యంగ్ హీరో విక్కీ కౌషల్ ‌ను ఎన్‌.సి.బి ప్ర‌శ్నించ‌నుంద‌ని మీడియా క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ప్ర‌ముఖ జాతీయ చానెల్ 2019 వీడియో గురించి విక్కీ కౌషల్ ‌ను ప్ర‌శ్నిస్తే విక్కీ మౌనంగా తప్పించుకున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

దర్శకుడు కరణ్ జోహార్ ఇంట్లో జ‌రిగిన‌ పార్టీ వీడియోలో క‌నిపించిన‌ బాలీవుడ్ నటులపై దిల్లీకి చెందిన‌ మాజీ ఎమ్మెల్యే.. అకాలీదళ్ నాయకుడు మంజిందర్ సింగ్ సిర్సా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) కు ఫిర్యాదు చేశారు. వీడియోలో కెమెరాను విక్కీ పైకి జూమ్ చేసిన‌ప్పుడు అతను తక్షణమే తన ముక్కును రుద్దుతున్న వైనం బ‌య‌ట‌ప‌డింద‌ని స‌ద‌రు చానెల్ క‌థ‌నం వెలువ‌రించింది. దర్శకుడు అయాన్ ముఖర్జీ పైకి కెమెరాను ప్యాన్ చేసినప్పుడు అతని వెనుక ఏదో దాచడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. వీడియోలోని దాప‌రికం ప్రశ్నార్థకమైంది. అదేంటి? అంటే.. తెల్లటి పదార్థాన్ని పోలి ఉందని కొంద‌రు.. దీనిని కాంతి ప్రతిబింబం అని మ‌రికొంద‌రు వాదిస్తున్నారని క‌థ‌నాలొస్తున్నాయి.

ఇదిలావుండగా బాలీవుడ్-డ్రగ్స్ వ్య‌వ‌హారంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి)  దీపికా పదుకొనే- శ్రద్ధా కపూర్- సారా అలీ ఖాన్ - రకుల్ ప్రీత్ సింగ్‌లను ప్రశ్నించ‌నుంది. ప్రస్తుతం గోవాలో ఉన్న దీపికా చార్టర్డ్ విమానం ద్వారా ముంబైకి రానున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గోవా నుంచి బయలుదేరనున్నార‌ని స‌మాచారం.
Tags:    

Similar News