• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్త సినిమా షురూ చేస్తా:...

కొత్త సినిమా షురూ చేస్తా: సీనియర్ డైరెక్టర్

By - Tupaki Desk
Update: 2020-05-29 09:30 GMT
తెలుగు ఇండస్ట్రీలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నారు. ఆయన సినిమాలతో తెలుగు రాష్ట్రాల కోట్ల సినీప్రియులందరిని ఎన్నో యేళ్లు అలరించారు. తెలుగు ఇండస్ట్రీ ఆయనను దర్శకేంద్రుడు అని కూడా పిలుచుకుంటుంది. ఆయన సినిమాల్లో చేయని హీరో లేడు.. ఆడిపాడని హీరోయిన్ లేదు. దర్శకేంద్రుడి సినిమా అంటే ప్రేక్షకులలో ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి. కానీ ఆయన సినిమాలలో అందరికి కావాల్సినవి సమపాళ్లలో అందిస్తారు. తియ్యని ఫ్రూట్స్ తో సహా.. ఇక గత కొంతకాలంగా దర్శకేంద్రుడు దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. ఆయన కెరీర్లో ఎప్పుడో తన 100 సినిమాల రికార్డు బ్రేక్ చేశారు. వంద సినిమాలకు పైనే దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు చివరిగా అక్కినేని నాగార్జున హీరోగా 2017లో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మళ్లీ ఆయన నుండి ఏ వార్త లేదు. అలా రెండేళ్ళకు పైగా దర్శకత్వానికి దూరంగా ఉండటం ఆయన కెరీర్లోనే మొదటిసారి.  

ఇక ఎప్పటినుండో ఎదురుచూస్తున్న రాఘవేంద్రరావు కొత్త సినిమా కబురు ఆయనే ప్రకటించారు. అన్నగారు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా రాఘవేంద్రరావు ట్విట్టర్ ద్వారా తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. "నా యాభై ఏళ్ళ సినీ జీవితంలో అన్నగారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. నా గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్లో ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. ఇక పై మరింత కొత్తగా ప్రయత్నించ బోతున్నాను. ఈ సందర్భంగా సినిమా కాన్సెప్ట్ తో ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ‘ముగ్గురు దర్శకులతో, ముగ్గురు హీరోయిన్స్‌తో దర్శకేంద్రుడి సినిమా. హీరో?’ అనే క్యాప్షన్‌ కూడా రాసుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా.." అంటూ ట్వీట్ చేశారు. ఈ వార్త తెలిసిన తెలుగు సినీప్రియులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శకేంద్రుడి సినిమా అంటే అందరి దాహం తీర్చేస్తది.. అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Tags:    
  • Veteran Director 
  • K Raghavendra Rao 
  • Pending Movie 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS