వకీల్ సాబ్ డైరెక్టర్ కెరీర్ లో ఎన్ని కష్టాలో!

Update: 2020-07-06 06:06 GMT
సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు ఊరికే రావు. ముఖ్యంగా దర్శకత్వం పై ఆసక్తి తో ప్రయత్నాలు చేసేవారు ఎప్పటికి అవకాశాలు దక్కించుకుంటారో లేదో చెప్ప లేని పరిస్థితి. ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ గా ఉన్న పలువురు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని మరీ సెటిల్ అయ్యారు. పవన్ తో ప్రస్తుతం వకీల్ సాబ్ చేస్తున్న దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా తన కెరీర్ లో చాలా ఇబ్బందులు పడ్డట్లు గా పేర్కొన్నాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వేణు శ్రీరామ్ మాట్లాడుతూ.. మాది జగిత్యాల జిల్లా మేడిపల్లి. అక్కడే పుట్టి పెరిగాను. నాన్న టైలరింగ్ చేసేవారు. ఆయన నేర్పించిన జీవితం కారణం గానే నేను ఈ స్థాయి లో ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి వంటి స్టార్ ను డైరెక్ట్ చేయడానికి కూడా ఆయనే కారణం. దర్శకుడి గా మారాలని కోరిక తో నేను హైదరాబాద్ వచ్చి పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాను. దిల్ రాజు గారు మొదట ఓ మై ప్రెండ్ తో ఛాన్స్ ఇచ్చాడు.

ఆ సినిమా విడుదల అయిన సమయంలోనే నాన్న చనిపోయారు. నాన్న చనిపోవడం జీవితంలోనే పెద్ద షాక్. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడక పోవడంతో తదుపరి సినిమాకు ఛాన్స్ వెంటనే దక్కలేదు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక కథ రాశాను. కానీ అది ఆయనను వినిపించే అవకాశం కూడా రాలేదు. రవితేజ గారి కోసం కూడా కథ అనుకున్నాను. కానీ అది కూడా సెట్ అవ్వలేదు. నాని తో MCA సినిమా చేసే ఛాన్స్ దక్కింది. ఆ సినిమా హిట్ అవ్వడం తో అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చారు. కథ కూడా ఆయనకు నచ్చింది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతోంది. ఐకాన్ సినిమా ఆలస్యం అవుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ చేసే అవకాశం వచ్చింది అంటూ దర్శకుడు తన సినీ కెరీర్ లో ఎదుర్కొన్న ఒడిదొడుకులు గురించి చెప్పుకొచ్చాడు. 
Tags:    

Similar News