• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వారిని టెన్షన్ పెడుతున్న...

వారిని టెన్షన్ పెడుతున్న వెంకీమామ..!

By - Tupaki Desk
Update: 2019-11-05 05:55 GMT
టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఉంటుంది.  ఇప్పటికే సంక్రాంతి సినిమాల పోటీ రచ్చ చూస్తున్నాం.  ఆ ఒక్క సీజనే కాదు.. డిసెంబర్ క్రిస్మస్ సీజన్ లో కూడా తీవ్రమైన పోటీ నెలకొంది.  డిసెంబర్ 20 నుంచి 25 లోపు రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాలలో చాలా మార్పులు చేర్పులు జరిగి ఇప్పటికి కొంతమంది ఫిక్స్ అయ్యారు.. కొందరు జనవరి ఫిబ్రవరి నెలలకు వాయిదా వేసుకున్నారు.  అయితే డిసెంబర్ లో రిలీజ్ ఫిక్స్ చేసుకున్న సినిమాల నిర్మాతలను 'వెంకీమామ' గడగడలాడిస్తోందనే టాక్ వినిపిస్తోంది.

విక్టరీ వెంకటేష్.. మేనల్లుడు నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న మల్టిస్టారర్ చిత్రం 'వెంకీమామ'.  సీనియర్ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు.  ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న తికమకతో డిసెంబర్ సినిమాల నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.  'వెంకీమామ' రిలీజ్ డేట్ ఒకసారి డిసెంబర్ 20 అంటారు.. మరోసారి సోలో రిలీజ్ డేట్ కావాలి డిసెంబర్ 13 అంటారు.. ఇవన్నీ లీకులే.. అధికారిక సమాచారం కాదు.  దీంతో ఆ డేట్లకు రిలీజ్ ప్లాన్ చేసుకున్నవారు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే పోటీలో ఉన్నవారు కూడా పెద్ద నిర్మాతలే కానీ సురేష్ బాబు రంగంలోకి దిగితే వారి సినిమాలకు ఎక్కువ థియేటర్లు దొరకవు.  సమస్యంతా థియేటర్లతోనే.  

ఇదిలా ఉంటే ఈ సినిమాను కనుక వారం అటూ ఇటూ ముందుకు జరిపితే కార్తికేయ సినిమా '90ML' కు ఇబ్బంది తప్పదు. ఈ సినిమాను డిసెంబర్ మొదటివారం లేదా రెండో వారంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.  అసలే హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కార్తికేయ సోలో డేట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. 'వెంకీమామ' టీమ్ కార్తికేయను టెన్షన్ పెడుతున్నారు.   'వెంకీమామ' రిలీజ్ డేట్ పక్కాగా చెప్తే.. దాన్ని బట్టి మిగతా సినిమాల వారు ప్లానింగ్ లో మార్పుచేర్పులు చేసుకుంటారు. అలా కాకుండా డేట్ విషయంలో తికమకపడి ఇతరులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  మరి వెంకీమామగారి అన్నయ్య సురేష్ మామగారు ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.
Tags:    
  • Tollywood 
  • TupakiUpdates 
  • Venky Mama 
  • TuapkiNews 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS